• గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం.
• ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పి అఖీల్ మహజన్ .
నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం) :
రాజన్న సిరిసిల్లా జిల్లాను గంజాయి రహీత జిల్లాగా మార్చడమే లక్ష్యమని జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గంజాయి సేవిస్తూ, ఇతరులకు అమ్ముతున్న 4 యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో బట్ట రవీందర్ , అంకర్ ప్రణీత్,ఈగ కృష్ణ, అంకర్ హశ్విత్ లు ఉన్నారని, వీరందరు సిరిసిల్లా పట్టణానికి చెందిన వారని తెలిపారు. అంకర్ ప్రణీత్,ఈగ కృష్ణ, అంకర్ హశ్విత్ లు గంజాయి అలవాటు పడి , బట్ట రవీందర్ వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేస్తుండగా,నమ్మదగిన సమాచారం మేరకు సిరిసిల్లా టౌన్ పోలిస్,టాస్క్ ఫోర్స్ పోలిస్ లు వారిని అదుపులోకి తీసుకొని, వారి నుండి 18 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధమున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు.జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు, జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికల రూపొందించిందని,ఎవరికై తగు సమాచారం లభిస్తే 100 కి గాని,ఎస్పి వాట్సప్ నెంబర్ కు గాని సమాచారం అందించాలని,సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కోరారు.
గంజాయి నిందితులను పట్టుకున్న జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కట్ల రవీందర్,ఎస్.ఐ. రవీందర్ నాయుడు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్స్ అక్షర్, మహిపాల్, శ్రీనివాస్,సిరిసిల్ల టౌన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.











Leave a Reply