• కేసిఆర్ కో హటవో…తెలంగాణ బచావో..!
• నిరుద్యోగ భృతి నివ్వలేదుగాని..నిరుద్యోగుల నుండి 5 వేలు వసూల్ చేసినవ్ .
• గజ్వేల్ ,సిద్దిపేట,సిరిసిల్లా లాగా మునుగోడు ఎందుకు లేదు…?
• లిక్కర్ నోటిఫికేషన్ రెండు నెలల ముందే ఇచ్చినవ్ ….మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏందుకు ఇవ్వలేదు…?
• కేసిఆర్ మూడోసారి వస్తే ముంచుడే…!
నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :


బంగారు తెలంగాణేమోగాని బిచ్చగాళ్ళ తెలంగాణగా రాష్ట్రం మారిందని,కేసిఆర్ కు ,బిఆర్ ఎస్ కు ఓటు వేయ్యోద్దని,కాళ్ళుమోక్కుతానని ఓ యువకుడు బిచ్చగాడి వేషాదారణతో, కేసిఆర్ కు ఓటు వేయ్యోద్దనే వీడియో సామాజిక మాధ్యామాలలో తెగ వైరల్ అవుతుంది.3.33ని”షాల నిడివి ఉన్న అ విడియోలో నిరుద్యోగ యువకుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో గజ్వేల్ లో నూనే కింద పడితే ఏత్తుకొవచ్చని,సిరిసిల్లా, సిద్దిపేటలను అభివృద్ది పరచినట్లు ‘మునుగోడు’ను ఎందుకు అభివృద్ది చేయలేదని ప్రశ్నించాడు.92 వేల ఉద్యోగాలను భర్తి చేస్తానన్న కేసిఆర్ , ఉద్యోగాల నోటిఫికేషన్లకు బదులు,లిక్కర్ నోటిఫికేషన్లు 2 నెలల ముందే వేశాడని ఎద్దేవా చేశాడు. నిరుద్యోగుల భృతి ఇస్తానన్న కేసిఆర్ ,భృతియేమోగాని నిరుద్యోగుల నుండే నోటీఫికేషన్ల ద్వారా 5రూ”లు వసూల్ చేశాడని దుయ్యబట్టాడు.దయచేసి ఎవరు కేసిఆర్ కు, బిఆర్ ఎస్ కు ఓట్లు వేయోద్దని,కేసిఆర్ కు ఓటేస్తే మీరు బిచ్చగాళ్ళౌతారని,బంగారు తెలంగాణేమో గాని బిచ్చగాళ్ళ తెలంగాణగా మారడం ఖాయమని,కేసిఆర్ కో హటవో ……తెలంగాణ కో బచావో, అనేదే మా నినాదమని, కేసిఆర్ మూడోసారి వస్తే ముంచుడేనని అ విడియోలో తెలిపాడు.











Leave a Reply