నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం) :
సెస్ సహకార సంస్థయే కావచ్చు,వారు సహకార చట్టాలకు లోబడే విధులు నిర్వహించడం జరుగుతుండవచ్చు.కాని ఏ చట్టమైన,ఎన్ని చట్టాలైన రాజ్యాంగ మూలాలకు లోబడి విధులు నిర్వహించాల్సి ఉంటుందన్న అవగాహన కూడ ‘సెస్ ‘పాలకవర్గానికి,అధికారులకు లేనట్టుంది.అందుకే సెస్ పరిధిలో మున్సిపల్ సంస్థ నిబంధనలకు విరుద్దంగా విద్యుత్ చౌర్యం చేస్తే,మేం మేం ఒకటి, అనుకున్నారో ఏమో సెస్ అధికారులు , చట్ట విరుద్దంగా విద్యుత్ చౌర్యం చేస్తున్న మున్సిపల్ సంస్థ పై 48 గం”లు గడిచిన ఏలాంటి చర్యలు చేపట్టలేకపోవడం తో ‘సెస్ ‘పాలకవర్గం,అధికారుల పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే ఒ మధ్యతరగతి ఇంటి యజమాని విద్యుత్ చౌర్యం చేస్తే, అదేదో రాజద్రోహమైనట్టు సెస్ అధికారులు ,పాలకవర్గం నిప్పులు చెరగడం , నానా హంగామా చేయడం జరుగుతుండేది.నిస్వార్థంగా వ్యవహరించాల్సిన స్థానిక సంస్థలు ఇలా సామాన్యునికి ఒ న్యాయం,ప్రభుత్వ అధికారులకు ఒ న్యాయం చేయడం భవిష్యత్ తరాలను ప్రభావితం చేయవచ్చని ప్రజా సంఘూలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికైనా సెస్ అధికారులు స్పందిస్తారా? లేదా? వేచి చూడాలి.











Leave a Reply