• సిరిసిల్లా పద్మశాలి 60 వేల ఓట్లను చీల్చుకునేది ఇద్దరు ‘పద్మశాలి’నాయకులే…!
• నియోజకవర్గంలో సిరిసిల్లా తప్ప మిగతా గ్రామాల్లో పట్టులేని ‘పద్మశాలినాయకులు”
• ఏవరి ఆత్మగౌరవం నిలబెట్టాలని పద్మశాలి నాయకులు ‘బరి’లో నిలుస్తున్నారని పట్టణంలో చర్చ.
• కేవలం సిరిసిల్లా పద్మశాలిల ఓట్లతోనే ‘ఆత్మగౌరవం” నిలబడేనా…?
నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :
సిరిసిల్లా లో పద్మశాలి నాయకులు ‘బరి’లో నిలిచి గెలిచేనా.? ఏవరి ఆత్మగౌరవం నిలబెట్టాలని పద్మశాలి నాయకులు ‘బరి’లో నిలుస్తున్నారు అని పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతుంది.ఈ నేపథ్యంలో ‘నేటిభారతం’ క్షేత్రస్థాయిలో సేకరించిన పలు విషయాలతో ప్రత్యేక కథనం.
ఆత్మగౌరవానికై ఒకరు, మార్పు కోసం మరొకరు ఎన్నికల బరిలో నిల్చోబోతున్నారు.ఇలా వ్యక్తులు ఇద్దరైనా లక్ష్యం మాత్రం వలస నాయకుల శకానికి స్వస్తి పలికి, పద్మశాలిలా,ఆత్మగౌరవాన్ని,స్థానిక నాయకత్వాన్నిపెంపొందించడమే.లక్ష్యం,ఉద్యేశ్యం బాగానే ఉన్న,ఫలితం ఆశించినట్లు వస్తుందా అనేదే ప్రశ్న..?
ప్రశ్న వేసుకోవడానికి అవకాశం లేకపోలేదు, నిజంగా , పద్మశాలి సామాజిక వర్గం నుండి నేటి వరకు ఒక్క నాయకుడు చట్ట సభల్లో లేరు. నియోజకవర్గంలో వారి జనభా దామాష నాయకున్ని ఏన్నుకోవాల్సి వస్తే ఖచ్చితంగా పద్మశాలి సామాజిక వర్గం నుండే ఒ ఎమ్మేల్యే రావాల్సింది.
కాని సిరిసిల్లా పరిస్థితులు వేరు..?
ఆర్థికం,సామాజికంగా అభ్యర్థులున్న,నేటి వరకు బలమైన నాయకత్వ పటిమ కలిగిన నాయకుడు లేకపోవడం, ఉన్న పరాన్న జీవిగానే ఉండటం.కేవలం ఎన్నికల 3నెలల ముందే హడవిడి చేసి,ఆకర్షించడమంటే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి మెరుపులు పనికిరావనే చెప్పాలి.
పైగా పద్మశాలి వర్గంలోని నాయకులు బిజెపి,బిఆర్ ఎస్,కాంగ్రెస్ అంటూ, వివిధ రాజకీయ పార్టిల్లో పని చేస్తూ,వివిధ పదవుల్లో ఉండటం కూడ,వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొవడానికి అడ్డంకులనే చెప్పాలి.ఆత్మగౌరవం అనేది వ్యక్తికి చెందింది.కాని కొన్ని సందర్భాల్లో అది పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి వ్యక్తి నుండి సముహనికి మారుతుంది. సిరిసిల్లాలో కూడ అదే జరిగింది.
‘ఆత్మగౌరవం’ వ్యక్తి నుండి సమూహనికి మారిన,
అది నిలబడాలంటే, అన్ని గొంతుకలు ఓకే రాగాన్ని ఆలపించాలి.60 వేల ఓటర్లున్న పద్మశాలిలు వారి ఓట్లన్ని వారి అభ్యర్థికే వేసుకుంటే,ఫలితాలు ఆశించినట్లు ఉంటాయి,కాని ప్రస్తుతం ‘బరి’లో లగిశెట్టి, పత్తిపాక సురేష్ లు నిలబడటం వల్ల పద్మశాలిల ఓట్లు ఇద్దరభ్యర్థులు పంచుకుంటే’ఆత్మగౌరవం’ ఎలా నిలబడుతుందనేదే ప్రశ్న..?
నియోజకవర్గంలో పద్మశాలిలను మినహాయిస్తే, మిగత ఓటర్లతో ఈ ఇద్దరికి దగ్గరి సంబంధాలు లేవు.లగిశెట్టి ‘ఉచిత పుస్తే మట్టేల’సేవకార్యక్రమం కేవలం కొన్ని కుటుంబాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. మిగత వర్గాలను ప్రభావితం చేయాలంటే సుదీర్ఘకాలం అన్ని వర్గాలకు దగ్గరగా ఉండాల్సిన అవసరముంది.కాని అ పని ఇద్దరు అభ్యర్థులు చేయలేదు.సురేష్ యువకుడు గనక భవిష్యత్ రాజకీయాలకు ఈ సమయాన్ని వేదికగా మార్చుకునే అవకాశం ఉంది తప్ప, గెలిచి చట్టసభల్లో నిలిచే అవకాశం లేదనే చెప్పాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ,ఈ ఎన్నికల్లో ‘పద్మశాలి’ల ఆత్మగౌరవం నిలబడాలంటే 60 వేల ఓట్లన్ని ఒకే వైపుకు మళ్ళీతే తప్ప ‘మ్యాజిక్ ‘జరగదనేది స్పష్టం.గతంలో బరిలో నిలిచిన పద్మశాలిలు కేవలం30 వేల ఓట్లు సాధించి డిపాజిట్ మాత్రం దక్కించుకొవడం తప్ప జరిగింది ఏమి లేదు.నేటి పరిస్థితులు కూడ ‘లగిశేట్టి,సురేష్ లు ఓట్లను పంచుకునేది కేవలం పద్మశాలిలవి మాత్రమే.
కాదని’ పద్మశాలిల’ ఆత్మగౌరవం మాత్రం నిలబడాలని ఇద్దరు భావిస్తే,ఎవరో ఒకరు, వర్గం కోసం త్యాగం చేసాయాల్సిన అవసరం ఉంది.మరి ఇద్దరిలో ఏవరు పదవులను త్యాగం చేసి జాతి గౌరవాన్ని నిలబెడతారో ,బరిలో నిలిచి గెలిచి,’ఆత్మగౌరవాన్ని”కాపాడతారో వేచి చూడాలి.











Leave a Reply