• బిఆర్ ఎస్ నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
• ఇప్పుడుకాకపోతే రేపు చేస్తామంటు దుందుడుకు సమాధానం ఇస్తున్న బిఆర్ఎస్ నాయకులు.
• బిఆర్ ఎస్ పతనం తప్పదని అంటున్న విశ్లేషకులు.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం) :
ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళుతున్న బిఆర్ ఎస్ నాయకులకు నిరసన సెగ తగులుతోంది.వివరాల్లోకెళితే ముస్తాబాద్ మండలం ,ఆవునూర్ గ్రామంలో బిఆర్ ఎస్ ఎంపిపి శరత్ రావు ఆధ్వర్యంలో ఇంటింటి ఓట్ల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా ఆవునూర్ గ్రామంలోని ప్రజలు బిఆర్ ఎస్ నాయకులను, దళిత బంధు ఎదని,డబుల్ బెడ్రుం ఎక్కడని, మిషన్ భగీరథ నీరేదని ప్రశ్నించారు.వారి ప్రశ్నలకు ప్రతీగా బిఆర్ ఎస్ నాయకులు ‘ ఇప్పుడు కాకపోతే రేపు చేస్తం బై” అంటు దుందుడుకు సమధానాలు తెలుపుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో తెగ వైరలౌతుంది.ఓట్లకు వచ్చిన వారు ప్రజలతో మాట్లాడే తీరు ఇదేనా అంటూ పలువురు అంటుండగా, బిఆర్ ఎస్ పార్టికి పతనం మొదలైందని, ఓటమి ఖాయమని విశ్లేషకులు తెలుపుతున్నారు.











Leave a Reply