కేసిఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదు.

Published by

on

*  బిజెపిలో ఓ రాష్ట్ర నాయకుడు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు.

• బిఆర్ ఏస్ ప్రజలను నమ్మడం లేదు, బిఆర్ ఎస్ నాయకులనే నమ్ముకున్నారు.

• కాంగ్రెస్ తోనే సబ్బండ వర్గాలు బాగుపడ్డాయి.

నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :

తెలంగాణలో కేసిఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదని కాంగ్రేస్ పార్టి నాయకుడు చక్రధర్  రెడ్డి అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సిరిసిల్లా నియోజకవర్గం, తన పరిధిలో,తన స్థాయిలో ప్రజలకు ఆందుబాటులో ఉండి,పలు కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.మంత్రి కేటిఆర్ పిలిచి,సముచిత స్థానం కల్పిస్తామని,బిఆర్ ఎస్ లోకి రావాలని కోరడంతో ,బిఆర్ ఏస్ లోకి వెళ్ళారని తెలిపారు.స్వంత ఖర్చులతో పార్టి కార్యాకలపాలు నిర్వహించినప్పటికి సరైన ఆదరణ లేని సమయంలో, ‘బండిసంజయ్ ‘ బిజెపిలోకి ఆహ్వనించి,బిజెపి రాష్ట్ర నాయకత్వ బాధ్యతులు అప్పగించారని పేర్కొన్నారు.రాష్ట్ర నాయకునిగా,తన పరిధిలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితి ఉండేదని,ఎవరైతే రాష్ట్రాన్ని దొచుకొని,అవినీతికి పాల్పడ్డారో, వారిని జైలుకు పంపి,బిజెపి ప్రజల్లో బలపడుతుందని,ఆశించామని,కాని బిఆర్ ఏస్ ,బిజెపి రెండు ఒక్కటేనని తెలిపోయిందని తెలిపారు.ఈ విషయంలో బిజెపి కార్యకర్తలు సైతం అమిత్ షా లాంటి జాతీయనాయకున్ని నిలదీస్తే సమాదానం లేదన్నారు.ఇలాంటి పరిణిమాల మధ్య ,బిజెపికి ప్రజల్లో విశ్వాసం లేదని తేలిపోవడంతో,కె.కె మేహేందర్ రెడ్డి ఆహ్వనం మేరకు,నా అనుచరులు,అభిమానులతో చర్చించి కాంగ్రెస్ పార్టి లోకి రావడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు బిఆర్ ఎస్ పార్టి అవినీతి కూపంలోకి వెళ్ళాపోయిందని, ఉంటే ఉంటాం.. పోతేపోతాం..ఎవరైన ఎప్పుడైన ఒసారి పోవాల్సిందేగా అని కేటిఆర్ అనడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. బిఆర్ ఏస్ పార్టి ప్రజలను నమ్ముకొదని,కార్యకర్తలను మాత్రమే నమ్ముకుంటది,ప్రజలంటే నమ్మకం లేని పార్టికి ప్రజల ఓట్లు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ అందించిన కాంగ్రెస్ పార్టిని ఆశీర్వదించి గెలిపించాలని,సబ్బండవర్గాల సంక్షేమం కాంగ్రే స్ తోనే సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్ ,జిల్లా నాయకులు నాగుల సత్యనారాయణ, ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు,జిల్లా నాయకులు వైద్య శివప్రసాద్ ,నాయకులు, కార్యకర్తలు పాల్కొన్నారు.

Leave a Reply

November 2023
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading