ఇచ్చిన హామీలే అమలు చేయలే… మళ్ల ఓట్లేట్ల అడుగుతరు?

Published by

on

నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం) : 

ఇచ్చిన హామీలే అమలు చేయలే… మళ్ల ఓట్లేట్ల అడుగుతరని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టి  అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ అన్నారు.అదివారం  తంగళ్ళపల్లి మండలం భరత్ నగర్ లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టోని మాట్లాడుతూ, హామీలను అమలు చేయని, బిఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ ప్రశ్నించాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గృహలక్ష్మి ,బి.సి లకు బిసి బంద్ అంటూ కాగితాలు పంచుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని దుయ్యబట్టారు.

ప్రజల్ని మోసం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు మరోసారి బయలుదేరారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బిఆర్‌ఎస్‌ నాయకులు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, గృహలక్ష్మీ ఇళ్లు, అంటూ లేనిపోని ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, ప్రజలెవరు నమ్మి మళ్ళీ మోసపోవద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే, మీ ఓటుతో అధికారం అందిస్తే , ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే అమలు చేస్తామని  హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ కమిటీ నాయకులు, యూత్ కమిటీ నాయకులు, గ్రామ శాఖ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

November 2023
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading