యదేచ్చగా విద్యుత్ చౌర్యం…చోద్యం చూస్తున్న’సెస్ ‘

Published by

on

• విద్యుత్ చౌర్యం చేస్తే కఠిన చర్యలు కేవలం ‘పేదలకేనా’…?

• ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులు ‘చౌర్యం” చేస్తే ‘చట్టాలను సవరించుకుంటారా?

• లక్షల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల ‘బకాయి’లను వసూల్ చేయకుండా ‘పేదల’ను పీడుస్తున్న ‘సెస్ ‘

నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : 

కొడలుకు సాల్ జెప్పి అత్త అల్లునితో పోయిందనే సామేతకు సరిగ్గా సరిపోయే ఘటన ఇది. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ,ప్రజలకు సేవలందిస్తూ, ఎవరైన నిబంధనలను అతిక్రమిస్తే జరిమానా లు విధిస్తూ, పాలనలో భాగమైన స్థానిక సంస్థలలో మున్సిపల్ సంస్థ ఒకటి. అలాంటి సంస్థ అయిన సిరిసిల్లా మున్సిపాలిటి,పరిధిలో పని చేస్తున్న వైకుంఠదామంలో  ఎలాంటి విద్యుత్ మీటర్ అమర్చకుండా విద్యుత్ చౌర్యం చేస్తున్నారు.  సిరిసిల్లా మున్సిపల్ సంస్థ మాత్రం ‘సకాలంలో పన్నులు చెల్లించండి,పట్టణ అభివృద్దికి సహకరించండని ,మైక్ లల్లో ప్రచారం చేస్తూ,వార్డ్ వార్డ్ కు మున్సిపల్ సిబ్బందులను నియమించి పన్నులు వసూల్ చేస్తున్నారు.అదే మున్సిపల్ సంస్థ మాత్రం  యదేచ్చగా విద్యుత్ చౌర్యం చేస్తున్నారు.

ఇదంత బహిరంగానే జరుగుతున్న ‘సిరిసిల్లా సెస్ ‘ అధికారులు,సిబ్బంది స్పందించకపోవడం విస్మయానికి గురి చేస్తుంది.  పేద,సాదారణ,మధ్య తరగతి ప్రజలు చాలిచాలని పరిస్థితుల్లో ఎప్పుడైన,ఏ సందర్భంలోనైనా విద్యుత్ చౌర్యం చేస్తే  అది దేశద్రోహమైనట్లు వ్యవహరించే ‘సెస్ ‘అధికారులు ,ఈ విషయంలో ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరిగిన సెస్ చైర్మన్ ,పాలకవర్గం కొత్త విద్యుత్ మీటర్ బిగిస్తుందా? బిగించి ప్రతినెల బిల్లులు వసూల్ చేస్తుందా? లేక ప్రజలు ఒ నెల గమనిస్తారు అ తరువాత అన్ని మర్చిపోతారనే నెపంతో ,ఎప్పటిలాగే చూసి చూడనట్లు వ్యవహరిస్తుందా? ఏం చేస్తారో వేచి చూడాలి.

Leave a Reply

November 2023
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading