• భారీ చేరికల సమావేశంలో కనిపించని అ ‘నాయకుడు’
• పట్టణ అధ్యక్షుడే సమావేశం నుండి వెళ్ళి పిలిచిన రాని వైనం.
• ఈ సందర్భంగా సమావేశం కాస్త ఆలస్యం.
• ఇలాగైతే సిరిసిల్లాలో ‘కారు”రోడ్డెక్కినట్లే..?
నేటిభారతం( ప్రశ్నించడమే పరిష్కారం) :
రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యలయం వద్ద ఉన్న బిఆర్ ఎస్ పార్టి కార్యాలయంలో ,సిరిసిల్లా పట్టణ దళితమోర్చ అధ్యక్షులు పెరుమాండ్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో బిజెపి నుండీ బిఆర్ ఎస్ పార్టిలోకి చేరికలు జరిగాయి.ఈ సందర్భంగా, ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా బిఆర్ ఎస్ పార్టి అగ్రనాయకులైన కొండూరి రవీందర్ రావు,గుడూరి ప్రవీణ్ ,తోట ఆగయ్య, చిక్కాల రామరావు,జిందం చక్రపాణిలందరు ఆసినులైన,రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు మాత్రమే పార్టి కార్యాలయంలో ఓ గదిలో ఉన్నప్పటికి సమావేశంలోకి రాకపోవడం చర్చకు దారితీసింది. చివరికి పార్టి పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సమావేశం మధ్యలో నుండీ వెళ్ళి పిలిచిన రాకపోవడంతో, సమావేశానికి వచ్చిన కార్యకర్తలు మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఏమైందో ఏమోగాని ‘చీటి’ సమావేశానికి రాకపోవడంతో చీటినర్సింగరావు అలిగారని తెలియవచ్చింది.ఇదే విషయాన్ని పార్టి కి అనుబంధగా పని చేస్తున్న ఓ యువకున్ని అడగగా అదేమి లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసేంది. ఇలా పార్టి నాయకుల మధ్య ‘శృతి” కలవక అలక పాన్పునెక్కితే రేపు ‘కారు”రోడ్కెక్కినట్లేనని సమావేశంలోని కార్యకర్తలు చర్చించుకొంటున్నారు.











Leave a Reply