* అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చైర్మన్ చేయడం వెనుక మర్మమేమిటి..?
• చైర్మన్ సచ్చీలుడే అయితే విచారణను ఎదుర్కొవాలి.
• 2 దశాబ్దాల కాలంగా ,సంస్థలో నౌకరి చేస్తున్న వ్యక్తే టపాసులు పేల్చాడు.
• అడిటింగ్ లో చేసిన తప్పులనూ తప్పించుకోవడానికే ఈ ప్రమాదం.
• విలేకర్ల సమావేశంలో కాంగ్రేస్ పార్టి ఏమ్మేల్యే అభ్యర్థి కే.కే మహేందర్ రెడ్డి.
నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)
సెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం పెద్ద కుట్టేనని,దిని పై కో ఆపరేటివ్ ఉన్నత అధికారులతో విచారణ జరిపించాలని సిరిసిల్లా నియోజకవర్గ కాంగ్రేస్ పార్టి ఎమ్మేల్యే అభ్యర్థి కె.కె మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,సెస్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తిని, చైర్మన్ చేయడమంటే,కేటిఆర్ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 14 నుండి22 వరకు ఆడిటింగ్ చేయాలని నోటిస్ లు ఇచ్చిన సమయంలోనే, అగ్ని ప్రమాదం యాదృచ్చికంగా జరిగిందని మేం భావించడం లేదని పేర్కొన్నారు.దిని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.దీపావళి సంభరాలు ఏం.డి, లేదా చైర్మన్ ఆధ్వర్యంలో జరగాల్సింది, అలా కాకుండా 2 దశాబ్ద కాలం పాటు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వ్యక్తి సంభరాలు నిర్వహించడం వెనుక ఉన్న కోణాన్ని వెలికి తీయాలని డిమాండ్ చేశారు. అడిటింగ్ లో జరిగిన తప్పిదాలను తప్పించడానికి పన్నిన పన్నాగమే ఈ ప్రమాదమని, ఈ చర్య కు ఎం.డి,చైర్మన్ లను బాధ్యులను చేస్తూ,వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టి ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు,పార్టి పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్ ,జిల్లా నాయకులు ,రాపెల్లి లక్ష్మినారాయణ, వైద్య శివ ప్రసాద్ ,గోలి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply