నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)
కడుపులో పేగుకు పుండైందని తారకరామ హాస్పిటల్ కు వైద్యం కొరకు వెళితే వైద్యం వికటించి యువకుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.బంధువులు, స్థానికులు తెలపిన వివరాల ప్రకారం కోనరావుపేట మండలం,నిమ్మపెల్లి గ్రామానికి చెందిన చిలుక భీమయ్య (55) ఎస్సి మాల కులస్థుడు. తన కడుపులో పుండైందని సిరిసిల్లా లోని తారకరామ హాస్పిటల్ కు వెళితే, పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని,ఇక్కడ తప్ప మరెక్కడ వైద్యం చేయరాదని వెంటనే వైద్యం చేయాలని యాజమాన్యం సూచించారని తెలిపారు. వైద్యం చేయడాని 2 లక్షల డిపాజిట్ సైతం తీసుకున్నారని, వైద్యం చేసిన తరువాత ఒ కాలు పని చేయకుండా అయిందని సమాచారం. శని వారం ఆపరేషన్ అయిందని ఆదివారం బాగానే ఉన్నాడని,రాత్రి 2 గం”లకు సైతం బాగానే ఉన్నాడని,రాత్రి వేళ సరైన వైద్యం,వైద్య సిబ్బంది సేవలు అందక భీమయ్య మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొంతమంది సందిట్లో సడేమియాలు ఆపరేషన్ చేసిన తరువాత గుండేపోటు వచ్చిందని, అందువల్లే మరణించాడని ప్రచారం చేయడం ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించింది.ఈ మధ్య కాలం ఆసుపత్రుల్లో జరిగన ఇలాంటి ఘటనలన్నింటికి గుండెపోటు రావడమే కారణమని తెలపడం పరిపాటిగా మారింది. ఇప్పటికై డబ్బులున్న ఇలాంటి ఆసూపత్రి యజమాన్యాలు డబ్బులకు కక్కూర్తి పడకుండా నిపుణులైన వైద్యులని నియమించుకోవాలని కోరుతున్నారు.











Leave a Reply