• నో గూగూల్ పే,ఫోన్ పే…ఓన్లీ క్యాష్ అంటున్న సేట్లు.
• కేంద్ర ప్రభుత్వ చట్టాలను బేఖాతరు చేస్తున్న సేట్లు.
• వ్యాపారమంత సవ్యమే అయినప్పుడు”ఆన్ లైన్ లావాదేవిలు” ఎందుకు వద్దంటున్నట్టు…?
• ‘ఇన్ కంమ్ ట్యాక్’ దాడులు జరగకనే లాపర్వా!
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం)
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ నగదు రహిత లావాదేవిలను ప్రవేశ పెట్టి,దేశంలో ‘ఇన్ కమ్ ట్యాక్స్ ‘ ఎగ్గొడుతున్న వారి భరతం పట్టడానికి, దేశ ఆధాయం పెంచడానికి పలు సంస్కరణలు,చట్టాలు చేశారు. అవేవి ఇక్కడ నడవవంటూ, ఇక్కడ వారు చెప్పిందే చట్టమన్నట్లుగా, వ్యవహరిస్తున్నారు, రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రం పెద్ద బజార్ లో గల కొంతమంది ‘సేట్లు’
స్థానికులు ,పలువురు వినియోగదారులు తెలిపిన వివరాల ప్రకారం. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని పెద్దబజార్ లో ఐరన్ ,వివిధ రకాలైన వస్తుల అమ్మకానికి తాతల నుండి వారికి పెట్టింది పేరు.గతంలో వినియోగదారులకు, అ సేట్లకు ఎలాంటి లావాదేవిలు జరిగినా, ప్రస్తుతం నరేంద్ర మోఢీ ప్రభుత్వం ,నగదు లావాదేవిలతో పాటు , నగదు రహిత లావాదేవిలు జరపాలని,నూతన చట్టాలను,సంస్కరణ చేసింది. కాని ‘అ’ సేట్లు మాత్రం వారి వద్ద గుగూల్ పేలు, ఫోన్ పేలు ,నడవంటూ,కేవలం క్యాష్ ఇవ్వాలని,లేదంటే క్యాష్ తెచ్చుకొని వస్తువులు తీసుకెళ్ళాలని వినియోగదారులకు చెబుతున్నారు.పై గా భారీ మొత్తంలో అమ్మకాలు,కొనుగొళ్ళు జరిగే అ సేట్ల దుకాణాలల్లో ఇప్పటి వరకు క్యాష్ బిల్ పొందిన వినియోగదారుడు ఎవరైనా ఉన్నారా అంటే వేళ్ళ పై లెక్కించొచ్చు. మరి వీరంత ఇంతగా! కేంద్ర ప్రభుత్వాలనే బేఖాతరు చేస్తున్నారంటే ,కేవలం ఐ.టి దాడులు జరగకపోవడమే. గత 8 ఎళ్ళ క్రితం ఒ భడ మేడికల్ వ్యాపారి ఇంట్లో ఐ.టి దాడులు జరిగిన అవి లోలోపలనే జరిగాయని,అందువల్లే ఈ సేట్లకు ఐ.టి శాఖ అంటే భయం లేదని ప్రజల్లో ఉన్న అభిప్రాయం.
ఏ చట్టమైన పేదలకేనా?’పెద్దల’కు వర్తించవా?
శ్రీ.శ్రీ, కవిత్వాల్లో, ప్రముఖ తెలుగు సినిమా డైరెక్టర్
క్రీ.శే టి. కృష్ణ సినిమాల్లో చూపినట్లు దేశం,రాష్ట్రం,జిల్లా,పల్లెల్లో చట్టాలు పెద్దలకు చుట్టాలుగా మారాయి. ప్రభుత్వ శాఖలైన ఏ.సి.బి, ఐ.టి, ఈడి, కమర్షియల్ &ట్యాక్సస్ లాంటి వాటికి ‘భడ’బాబులు బేదిరేదే లేదు. అందుకే వారికి నచ్చినట్లు వ్యాపారాలు చేస్తూ, వినియోగదారులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.కేవలం ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొచ్చే నాయకులున్నంత వరకు, నాయకులను ప్రజలు గేర్రేల్లా నమ్మెంత వరకు,చదువుకున్న యువత ఇలాంటి గతి తప్పుతున్న పద్దతులను ప్రశ్నించనంత వరకు ప్రభుత్వాలు, భడ బాబులు ఇలాగే ఉంటారు. ఇకనైనా యువత ఆలోచించాలి, అక్రమాలను ,అవినీతిని ప్రశ్నించాలి.ప్రశ్నించడంతోనే మార్పు జరుగుతుందని గ్రహించాలి.











Leave a Reply