నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్లా జిల్లా :
• కాంగ్రేస్ పార్టికి ,పార్టి ఏమ్మేల్యె అభ్యర్థులు విధేయులుగా ఉంటారా?
• కేసిఆర్ రాజకీయ చదరంగంలో పావులుగా మారతారా?
• ప్యాకేజి తీసుకొని, ఇతర పార్టిలకు అమ్ముడుపోయి ప్రజల్లో చులకనైతారా..?
• పలు అంశాల పై నేటి భారతం ‘ప్రత్యేక కథనం’
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు, నాయకుల తీరుతెన్నలు, పార్టి క్యాడర్ ,గతంలొ వివిధ పార్టిలోని నాయకుల చరిత్ర,119 నియోజకవర్గాలలోని నాయకులు వ్యవహర శైలి, ఇప్పుడు రాష్ట్రంలొ వీస్తున్న కాంగ్రెస్ అనుకూల పవనాలకు అడ్డవేసే ప్రమాదం ఉందా?? లేదా స్వామి భక్తితో నిస్వార్థ రాజకీయాలను కొనసాగిస్తారా అనే అంశం పై నేటి భారతం ప్రత్యేక కథనం.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బిఆర్ ఎస్ విధి,విధానాలు,నినాదాలతో పలు వర్గాలు కారు గుర్తంటేనే మూతి విరుస్తున్నాయి.నిన్న, మొన్నటి వరకు జై కేసిఆర్ ఆన్న గొంతులు కూడ కొత్త రాగం ఆలపిస్తున్నాయి. బిఆర్ ఎస్ అధినేత పథకాల పై మాత్రమే పంచ ప్రాణాలు పెట్టుకొన్నారు తప్ప,సాధారణ జనాలతో ఏనాడు జత్త జట్టలేదని, పార్టి నాయకులతోనే రాజకీయాలు నడుపుతున్నారని విమర్శలున్నాయి. మరో పక్క బిఆర్ ఎస్ పై ఉన్న అసమ్మతిని,వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకున్న కాంగ్రేస్, ప్రజల్లో విశ్వాసాన్ని కూడగట్టుకొని డిసెంబర్ 3 న జరిగే ఎన్నికల యుద్ద భేరికి సర్వం సిద్దం చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టికి అనుకూల పవనాలు వీస్తున్న, అతి ప్రమాదకురమైన ఘట్టమైన, “ప్రభుత్వ ఏర్పాటు”ను కాంగ్రెస్ పార్టియే చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.కారణం….?
రాజకీయ చతురుడు,చాణిక్యుడని,రాజకీయ నాయలకు గొప్పగా చెప్పుకునే కేసిఆర్ ఎ చిన్న అవకాశమున్న 3వ సారి ప్రభుత్వ ఎర్పాటుకు సర్వ శక్తులొడ్డే పనిలో ఉంటాడు. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన 60 సీట్లకు 20 సీట్లు తక్కువ వచ్చినా,బిఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కేసిఆర్ ప్రణాళాకలు రచించే ఉంటాడని రాజకీయ నిపుణుల అంచన.ఆయన శైలిలో ఆలోచనలు చేస్తే, 119 నియోజకవర్గాలలో ,ఏవరు పలుసార్లు ఓటమి చెంది,ప్రస్తుత ఏన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయో,వారికి భారీ ప్యాకేజిలిచ్చైనా బిఆర్ ఎస్ లో కలుపుకొనే పనిలో ఉంటాడని జిల్లాలో చర్చ జరుగుతుంది .అలా సాధ్యం కాకపోయిన రాష్ట్రంలో ఎస్సి,ఎస్టి నియోజకవర్గాలలో గెలిచే అవకాశముండి,ఆర్థికంగా వెనుబడిన గెలుపు గుర్రాలకు గాలమేయడానికి పక్క ప్రణాళికలు ఆల్ రేడి సిద్దం చేసుకుని ఉంటాడని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి నలుదిక్కుల నుండి వీస్తే తప్ప, ఏ చిన్న అవకాశమున్న కేసిఆర్ బిఆర్ ఏస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కనే సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి.ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,గెలుపు గుర్రాల కొర్కెలకు కళ్ళెం వేస్తాడా? కాంగ్రేస్ పార్టి ఏమ్మేల్యే అభ్యర్థులు పార్టికి విధేయులుగా ఉంటారా? ఎప్పటిలాగే ప్రజల అభిప్రాయాలను నమ్మకాన్ని అమ్మకానికి పెడతారా? అనేది ఓట్ల లెక్కింపు దాకా వేచి చూడాలి.











Leave a Reply