నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది బిఆర్ ఎస్ ప్రభుత్వమేనని పద్మశాలి రాష్ట్ర చేనేత ఐక్యవేదిక సంఘం అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అన్నారు. శనివారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిరిసిల్లా సమాజం ఓ మార్పు దిశగా ఈ ఎన్నికల్లో తన వాణి నివిపిస్తుందని ఆకాంక్షాంచారు.కొంతమంది భయబ్రాంతులకు గురైనప్పటికి వారి మనస్సులో స్పష్టమైన అవహగన ఉందని తెలిపారు. సురేష్ కు అన్ని వర్గాల వారు అనుకులంగా ఉండటం కనిపిస్తుందన్నారు.చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వమేనన్నారు,పద్మశాలి వర్గాన్ని కేవలం వారిని ఓటు బ్యాంక్ కోసమే వాడుకుంటున్నారని తెలిపారు. టెస్కొ ను పూర్తి గా రద్దు చేసింది ఈ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. చేనేత సహకార సంఘూలను పుర్తిగా రద్దు చేసి, కేంద్ర సహకార బ్యాంక్ లలో చేనేత సంఘూలకు సభ్యత్వం లేకుండా చేసి,రుణాలు రాకుండా చేశారని దుయ్యబట్టారు.చేనేత రంగం పట్ల, పద్మశాలిల పట్ల ప్రభుత్వానికి ప్రేమ ఉంటె సిరిసిల్లా సీటు పద్మశాలిలకు ఇచ్చేది ఉండేదని అభిప్రాయపడ్డారు. పద్మశాలి నాయకునికి సిటు కేటాయించి వారిని గెలిపించాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.సిరిసిల్లా సమాజం మార్పు దిశగా అడుగులు వేయాలని, సిరిసిల్లా ప్రజలందరు స్థానికుడు, యువకుడైన పత్తిపాక సురేష్ ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పత్తిపాక సురేష్ కు మద్దతు తెలిపిన వారిలో పద్మశాలి రాష్ట్ర చేనేత ఐక్యవేదిక సంఘం ,వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిపల్లి సదానందం,కార్యనిర్వహక అధ్యక్షులు చిందం అంకారపు సునిత,జడల చిరంజీవి,కుడికాల భాస్కర్ ,బింగి రాణి,దూడం అంజలి,దాసరి జయగౌరి, చెన్నూరు సునిత,అనుముల కళావతి,లు ఉన్నారు.











Leave a Reply