నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):


అభివృద్ది చెందిన నగరాలలో ఆడపిల్లలు స్కూటిలు,ఎక్సేల్లు నడపడం చూస్తున్నాం.కాని,రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండల గ్రామమైన బాలమల్లుపల్లెకు చెందిన అమ్మాయి, మగవాళ్ళు నడిపే ద్విచక్రవాహనాన్ని దైర్యంగా,అచ్చం అబ్బాయిల మాదిగానే ఠీవిగా నడుపుతూ ‘నేటి భారతం’ రిపోర్టర్ కు తారసపడింది.అ అమ్మాయిని అభినందిచి, వివరాలు తెసుకొనగా,తన పేరు రమ్య అని, బొడ్డు సురేందర్ రెడ్డి,రేవతి ల కూతురునని,బి.కాం సెకండ్ ఇయర్ చదువుతున్నానని,తన చెల్లి 8 వ తరగతి చదువుతుందని తెలిపింది.బండి నడిపేప్పుడు భయంగా లేదా అని ప్రశ్నించగా? మా గ్రామానికి బస్సులు వత్తలేవని,బండి నడపడం నేర్చుకుందని,మేం సిరిసిల్లా వెళ్ళాళ్ళన్న, మా పాప కాలేజికి వెళ్ళాళ్ళన్న ద్విచక్రవాహనం పై బద్దన పెల్లి స్టేజి వరకు వెళ్ళి, అక్కడి నుండి బస్సులో ప్రయాణిస్తుంటామని తల్లి రేవతి తెలిపింది. ఆడపిల్లలంటేనే భారంగా భావించే ఈ రోజుల్లో, అవకాశాలు,ప్రోత్సహం అందిస్తే అమ్మాయిలు ఏ రంగంలో నైన రానిస్తామని నిరూపిస్తూనే ఉన్నారు. ద్విచక్ర వాహనాన్ని నడిపేప్పుడు భయం లేని తత్వం, ఏవరేమనుకుంటారోననే మోహమాటం లేనితనం,రమ్య ఠీవి ఈ జిల్లా ఆడపిల్లలకు ఆదర్శం. రమ్య లాగే జిల్లాలోని ఆడపిల్లలందరు దైర్యంతో ముందడుగేయాలని ‘నేటిభారతం’ఆశిస్తూంది.










Leave a Reply