నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి డా “సుమన్ రావు ను తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్(THANA) రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సన్మానించారు.అనంతరం సుమన్ రావు మాట్లాడుతూ,డాక్టర్స్ డే,బి. సి రాయ్ జన్మదినం సందర్బంగా తనను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.సంపాదనే కాకుండా పేరు, ప్రఖ్యాతలు ఒక్క వైద్య రంగంలోనే లభిస్తుందన్నారు.ప్రజలు ప్రత్యక్ష దైవంగా భావించే వారెవరైనా ఉన్నారంటే వారు వైద్యులేనన్నారు. ఈ కార్యక్రమంలో డా “రమేష్, డా “మురళీకృష్ణ, డా “సురసురా రాధా కృష్ణ, డా “జైల్ సింగ్,మానేరు స్వచ్చంద సంస్థ అధ్యక్షులు చింతోజ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply