• గత ప్రభుత్వానికి ప్రచారా అస్త్రం గా మారిన సి. ఎం రిలీఫ్ ఫండ్.
• ఎన్నికల కోడ్ తో, సాయమందని లబ్ధిదారులు జిల్లా లో వెయ్యి కి పై మాటే.
•కొత్త ప్రభుత్వం ఏర్పడి 5నెలలు గడుస్తున్నా సి. ఎం రిలీఫ్ ఫండ్ ఊసే లేదు.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
కొత్త ప్రభుత్వం ఏర్పడి 5నెలలు గడుస్తున్నా సి. ఎం రిలీఫ్ ఫండ్ ఊసే లేదు.గత ప్రభుత్వానికి ప్రచార అస్త్రం గా మారిన సి. ఎం రిలీఫ్ ఫండ్, నేడు! సి. ఎం రిలీఫ్ ఫండ్ అనే మాట అధికారులు, పాలకులు , చివరికి గల్లి లీడర్లు కూడా ఊసే ఎత్తడం లేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, నాటి టిఆర్ఎస్ నాయకులు ప్రజలకు అందిస్తూ, తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటూ ప్రజలకు ప్రచారం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన సందర్భాలు అనేకం. కానీ నేడు! ప్రజలే ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులపై ఎలాంటి శ్రద్ధ చూపకపోవడం శోచనీయం.గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నేటికీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమైనప్పటికీ, సీఎం గారు రేవంత్ రెడ్డి, వాటన్నిటి అధిగమిస్తూ ఏదో చేస్తారని నమ్మకంతో ఉన్నారు ప్రజలు.ఈరోజు ఉదయం సీఎం రిలీఫ్ ఫండ్ ప్రక్రియాంత ఆన్లైన్లోనే జరుగుతుందని ప్రకటించిన సీఎం, గతంలో దరఖాస్తు చేసుకొని సంవత్సరాలు గడిచిన లబ్ధిదారుల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ విషయంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన ఆది శ్రీనివాస్ స్పందించి సమాచారం ప్రజలకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.











Leave a Reply