నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.





రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్, గీతా నగర్, సిరిసిల్ల పాఠశాల విద్యార్థులు బాసర ‘ఐ ఐ ఐ టీ’ కి ఎంపిక అయినట్లు పాఠశాల హెచ్ఎం లోకినీ శారద తెలిపారు.విద్యార్థుల ఆసక్తి, ప్రభుత్వ సహకారం, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధతో సిరిసిల్ల జడ్పిహెచ్ఎస్ గీతా నగర్ పాఠశాల నుండి ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎంపిక అవుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరం బాసర ‘ఐ ఐ ఐ టీ’ ఎంపికైన వారిలో 1.దూస మనోజ్, 2.మిట్టపల్లి రఘునందన్,3.బద్దేపూరి మెహెరా,4.దూస శ్రీ చరణ్,5.ఆడెపు అక్షయ. విద్యార్థులు ఉన్నట్లు హెచ్ఎం తెలిపారు.బాసర ‘ఐ ఐ ఐ టీ’ ఎంపికైన పాఠశాల విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.











Leave a Reply