మున్నాళ్ళ ముచ్చటేనా? ” ట్రాఫిక్ సిగ్నల్స్”.

Published by

on

 • ఎలక్షన్ల కోసమే మురిపించారంటూ అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

• ట్రాఫిక్ సిగ్నల్ లో పర్యవేక్షణ ట్రాఫిక్ పోలీసులేదా? మున్సిపల్ సంస్థదా?

• ప్రతిరోజు సర్కస్ ఫిట్లు చేయలేక బెంబేలెత్తిపోతున్న   విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు.

 • పర్యవేక్షణ ఎవరిదైనా? వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు.

 

నేటి భారతం ప్రశ్నించడమే పరిష్కారం:

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని, పాత బస్టాండ్,  నేతన్న చౌక్ వద్ద ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్ లు మూన్నాళ్ళ ముచ్చటేనా? అని ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు,ప్రశ్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు రెండు మూడు నెలలు ముందుగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ కేవలo ఎలక్షన్ స్టంటేనని ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ స్టంటే కాకపోతే మరెందుకు ఇన్ని నాళ్ళు సిగ్నల్స్ పనిచేయకున్న ట్రాఫిక్ పోలీస్ అధికారులు గాని,  సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గాని పట్టించుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రభుత్వాన్ని నడుపుతున్న పాలకులు, ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు పట్టణాన్ని పురోగమనం వైపు తీసుకెళ్లాల్సింది పోయి అధికారులు, పాలకులు తిరుగమనం వైపు తీసుకెళ్తున్నారా, అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఆరు నెలల క్రితం అభివృద్ధి అభివృద్ధి అంటూ జపం చేస్తూ  ప్రచారం చేసిన,  సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్,  పట్టణంలో ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఏం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికైనా స్థానిక ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ సమస్య పట్ల శ్రద్ధ చూపుతూ సిగ్నలను ఏర్పాటు చేయాలని ప్రజలు  కోరుతున్నారు.

Leave a Reply

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading