


• సిరిసిల్ల పట్టణ సిఐ కే. కృష్ణ.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ప్రజల సమస్యల పరిష్కారo కోసమే “మీకోసం ” కార్యక్రమమని సిరిసిల్ల పట్టణ సిఐ కే. కృష్ణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మొబైల్లో అపరిచిత వ్యక్తులు పంపిన లింకులను ఓపెన్ చేయొద్దన్నారు. యువత గంజాయి కి దూరంగా ఉండాలని, గంజాయి నియంత్రణకు ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తు, గంజాయి వినియోగం, రవాణా సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.ప్రజల సహకారం లేనిదే గంజాయిని నిర్మూలించలేమని తెలిపారు .పోలీస్ స్టేషన్ బాధితుల కొరకు ఏర్పాటుచేసిన దేవాలయం లాంటిదని, పోలీస్ స్టేషన్ రావడం అంటే, తప్పు చేసినట్లు కాదని పేర్కొన్నారు. ప్రజలు నిర్భయంగా వారి సమస్యలు పోలీసులతో తెలుపుకోవాడానికే పోలీస్ స్టేషన్ ఉందని, పోలీసుల సేవలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, కౌన్సిలర్ రెడ్యా నాయక్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ వెంగళ లక్ష్మీ నరసయ్య, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి ప్రజలు పాల్గొన్నారు.











Leave a Reply