• సిరిసిల్ల నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ కోసం బట్టలు చింపుకుంటున్న అందరికీ ‘ప్రభుత్వ భూములు’ పంచి పెట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం.
• బిఆర్ఎస్ ప్రభుత్వం పంచిపెట్టిన, ప్రభుత్వ భూములు పొందిన వారంతా “బడా బాబులే”?
• ‘ప్రభుత్వ భూములు’ పొందినవారి లో సర్పంచ్, ఎంపిటిసి, వార్డు కౌన్సిలర్లు, పార్టీ పట్టణ, జిల్లా అధ్యక్షులు, పి. ఏ ల వరకు ఉన్నట్లు అనుమానాలు…?
• బిఆర్ఎస్ పార్టీ చోట, మోట నాయకులకు ఉన్న భూములు పంచితే మాకేమిస్తారని ప్రశ్నిస్తున్న ‘నిరుపేద కుటుంబాలు’
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ఉద్యమంతో పుట్టిన పార్టీ అని, ఆ ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ అని, అ పార్టీ అధికారంలోకి వస్తే తమకేదో చేస్తుందని ఎదురుచూసిన వారందరికీ, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని! ప్రజలు తెలుసుకుని అ ప్రభుత్వాన్ని దించేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యమ పార్టీతో నిరుపేద కుటుంబాలకు 3000 ఆసరా, లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి తప్ప జరిగిన మేలు ఏమీ లేదు. కానీ ఉద్యమ పార్టీ అయిన బిఆర్ఎస్ కోసం బట్టలు చింపుకున్న అందరికీ నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం,ప్రజాధనాన్ని,ప్రజల ఆస్తుల్ని, సిరిసిల్ల నియోజకవర్గంలో పలారంలా పంచి పెట్టిందని ప్రచారం జరుగుతోంది .పలారంలా పంచి పెట్టింది అని తెలపడానికి “నేటి భారతం’ (ప్రశ్నించడమే పరిష్కారం) అతి త్వరలో ఆధారాలతో సహా మీ ముందుకు రాబోతుంది. నాటి ప్రభుత్వం పంచిపెట్టిన ప్రభుత్వ ఆస్తులను పొందిన వాళ్లల్లో బడా బాబులు, బి ఆర్ఎస్ చోటామోటా నాయకులు ఉన్నట్లు పక్కా సమాచారం. పూర్తి వివరాలను ‘నేటి భారతం” మీ ముందు ఉంచబోతుంది.అప్పటివరకు నేటి భారతదేశం వెబ్ సైట్ ని చూడాలని కోరుతున్నాం.











Leave a Reply