• నెల రోజుల నుండి వెలగని ట్రాఫిక్ సిగ్నల్స్.
• అయినా పట్టించుకోని ‘పాలకులు, అధికారులు.
• నేటి భారతం రిపోర్టర్ తో ‘ నేతన్న విగ్రహం ఆవేదన.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
బాబు ! నాయన ! నేటిభారతం రిపోర్టర్!! నేను నేతన్న విగ్రహాన్ని.ఈ సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అధికారులు, పాలకులు నన్ను ఎన్నికలు, జయంతిలప్పుడే నా పై శ్రద్ధ చూపుతున్నారు తప్ప!అ తరువాత నన్ను పట్టించుకొనే వారే కరువైయ్యారు. సిరిసిల్ల పాత బస్టాండ్ కూడళి లో నా విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు, సిరిసిల్ల జిల్లాగా రూపాంతరం చెందలేదు, పైగా జనాభా అంతగా కూడా లేదు. సిరిసిల్ల జిల్లాగా మారిన తర్వాత, వాహనాల వినియోగం, ప్రజల రద్దీతో పాత బస్టాండ్ లో ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నాయి. ఇంతలో ఏ పుణ్యాత్ముడో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి, నా మీదికి అతివేగంగా వస్తూ, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్న భారీ వాహనాలను, ద్విచక్ర వాహనాలను అదుపు చేసాడు. హమ్మయ్య! ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని ఊపిరి పీల్చుకుని నిశ్చితంగా ఉందామనే లోపే,ఏమయిందో,ఏ అధికారుల, పాలకుల నిర్లక్ష్యమో, తెలియదు కానీ గత నెల రోజుల నుండి ట్రాఫిక్ సిగ్నల్ వెలగడం లేదు.నేను నెల రోజుల నుండి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బెంబేలెత్తిపోతున్నాను. ఓ రోజు ఓ లారీ నన్ను తాకుతూ వెళ్తున్నట్లుగా, ప్రతిరోజు పద్ధతి పాడు లేకుండా, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు వాహనాలు నడుపుతూ, నన్నెక్కడ ఢీకొంటారోనని భయాందోళనకు గురవుతున్నాను .ఎవరైనా స్పందించి సిగ్నల్ వెలిగేలా చేస్తారేమోనని, ఆశగా ఎదురు చూస్తున్న! అయినా ఏ ఒక్కరికి నా ఆవేదన కనిపించడం లేదు, వినిపించడం లేదు.ఇకనైనా జర్ర… నన్ను… పట్టించుకోండయ్యా అంటూ తన మనోవేదనను తెలిపాడు. మరి ఇప్పటికైనా అధికారులు గానీ, పాలకులు గాని, స్పందిస్తారా? నేతన్న ఆవేదనను పట్టించుకుంటారా? వేచి చూడాలి.











Leave a Reply