మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలి.

Published by

on

• మేర సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా.

నేటి భారతం(ప్రశ్నించడమే పరిస్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలని  తెలంగాణ మేర సంఘము జె ఏ సి ఛైర్మన్ మునిగాల రాము డిమాండ్ చేసారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సంఘము జిల్లా అధ్యక్షులు ఓ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, సంఘము నాయకులు మాట్లాడుతూ, ఉపాధి లేక ఆర్థికంగా వెనుకబడి పోయిన వారికీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 5 వేల కుట్టు మిషన్ ల తో స్మాల్ స్కెల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి,మేర కుల వృత్తిని ఆదుకోవాలని కోరారు. మేర కులస్తులు వ్యవసాయం మీద కాకుండా, బట్టలు కుట్టడమే వృత్తి గా జీవిస్తున్నారని, ఆర్థికంగా వెనుకబడిన మేరు కులస్తులను BC – D నుండి BC -A లోకి మార్చాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ స్థాయిలలో మేర కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని,  ప్రభుత్వ పరంగా బట్టలు కుట్టే టెండర్లు మేర కులస్తుకే ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మేరు సంఘం జేఏసీ నాయకులు వెంకట్రాజం,మునిగాల రమేష్, దీకొండ లక్ష్మణ్, దీకొండ శేషగిరి, రామగిరి శ్రీనివాస్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

  1. Munigala Ramu garu, Am appreciating you.

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading