

• సమావేశం ఉందంటూ లేఖలు పంపి అవమానించారన్న సభ్యులు.
• ప్రతి సమావేశంలోనూ ఇదే తంతoటూ అసహనం వ్యక్తం చేసిన సభ్యులు.
• కలెక్టర్ తీరుతో సమావేశాన్ని బహిష్కరించిన సభ్యులు.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల నివారణ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం ఉందంటూ! సమావేశం, సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టర్ కార్యాలయ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు , కలెక్టర్ వైఖరి ఎస్సీ ఎస్టీ సమాజాన్ని అవమానించినట్లేనని, కమిటీ సభ్యులు, కొట్టపల్లి సుధాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, ఆయన మాట్లాడుతూ! నేడు జిల్లా కార్యాలయంలో అంటరానితనం నిర్మూలన పై SC&st అట్రాసిటీల నివారణ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం ఉందంటూ, కమిటీ సభ్యులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు లేఖలు పంపారన్నన్నారు. సమావేశం, సమయాని కంటే ముందే కార్యాలయంలో వేచి ఉన్నప్పటికీ, సమావేశం నిర్వహించకుండా వాయిదా వేశారనితెలిపారు. సమావేశం ఉందంటూ లేఖలు పంపిన ప్రతిసారి, సమావేశాన్ని వాయిదా వేయడం అంటే ఎస్సీ ఎస్టీ సమాజాన్ని అవమానించినట్లేనని ఆరోపించారు. సమావేశం వాయిదా వేయడానికి గల కారణాలను వారికీ ముందే చరా వాణి ద్వారా తెలియజేస్తే, తాము సుధీర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళం కాదని తెలిపారు.ఎస్సీ ఎస్టీ నాయకులన్న, ప్రతినిధులన్న ప్రభుత్వానికి, అధికారులకు చులకన భావన తగదని అన్నారు.ఈ కార్యక్రంలో sc, st అట్రాసిటీల నివారణ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు డప్పుల అశోక్,మెట్ట దేవానంద్, కొమ్ము బాలయ్య, అల్వాల ఈశ్వర్, పసుల బాలరాజు, లకావత్ తిరుపతి నాయక్, అజ్మీర తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply