నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 11, 2024.
“బతుకమ్మ సంబరాల్లో”భాగంగా వినూతన బతుకమ్మ సంబరాలు నిర్వహించారు “డాబర్ ఇండియా లిమిటెడ్ ” వారు.సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ వీధి లోని అయ్యప్ప సూపర్ మార్కెట్ వద్ద డాబర్ ఇండియా లిమిటెడ్ ” ప్రొడక్ట్స్ అయినా టూత్ పేస్ట్ మొదలైన వస్తువులను “బతుకమ్మ” గా పేర్చి ‘బతుకమ్మ ఆడటం’ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది.ఈ సంబరాల్లో అయ్యప్ప సూపర్ మార్కెట్ సిబ్బంది, బతుకమ్మ ఆటలాడగా,బతుకమ్మ పాటలను ప్రముఖ జానపద గాయకుడు ఆకునూరి దేవయ్య ఆలపించారు.అనంతరం డాబర్ ప్రొడక్ట్స్ ను అయ్యప్ప సూపర్ మార్కెట్ సిబ్బంది కి, ఆఫర్ ను వినియోగించుకున్న కాస్టమర్లకు అందజేశారు.ఈ కార్యక్రమంలో Zsm తేజశ్రీనివాస్, Rsm సతీష్ బాబు, సురేందర్ రెడ్డి, so సతీష్, సిరిసిల్ల డిస్ట్రిబ్యూటర్ గాయత్రి ఎంటర్ప్రైజెస్, కన్సల్ట్ ఎమ్మార్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply