మరణించిన వ్యక్తులకు పట్టా సర్టిఫికెట్లు…?

Published by

on

2018 లో మరణించిన బిట్ల పొచ్చయ్య, పేరు పై 2020లో 7 1/2 గుంటలు భూమి ఉన్నట్లు సిరిసిల్ల ఎమ్మార్వో ధ్రువీకరణ పత్రాలు.

* 2018 మరణించిన వ్యక్తికి 2020లో పట్టా జారీ చేసిన “సిరిసిల్ల ఎమ్మార్వో”

* సిరిసిల్ల MRO కార్యాలయంలో VRA గా పని చేస్తున్న,ఎలాంటి భూమి లేని వ్యక్తికి  కాళేశ్వరం 9 వ ప్యాకేజి పరిహారం.

*చందుర్తి మండల పరిధిలో ఎలాంటి దరఖాస్తు చేసుకొని వ్యక్తికి పట్టా పాస్ బుక్స్ ఇచ్చిన MRO.

• MRO లు జారీ చేసిన పట్టా ల పై RTI ద్యారా సమాచారం అడిగితే, రికార్డులు లేవని చెప్పుతున్న mro లు.

‘నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

Oct 13, 2024.

అక్రమార్కులతో చేతులు కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లా లోని కొంతమంది ఎమ్మార్వో లు మరణించిన వ్యక్తులకు భూమి పట్టా సర్టిఫికెట్లు జారీ చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని జిల్లా అఖిల పక్షం నాయకులు ఆరోపించారు.ఆదివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో అఖిల పక్షం ఆధ్వర్యంలో జరిగిన విలేకర్ల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ,చందుర్తి మండల పరిధిలో గత ఎమ్మార్వో, డిప్యూటీ తహసీల్దార్, ఇతర సిబ్బంది ఎలాంటి కాగితాలు లేకున్నా మల్యాల శివారులో సర్వే నం :290లో ఎలాంటి దరఖాస్తు చేసుకొనటువంటి వ్యక్తికి పట్టా పాస్ బుక్స్ ఇచ్చారని, వాటి పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు లోని 9వ ప్యాకేజీ పనులలో భూములు కోల్పోతున్న వారికీ ఇవ్వాల్సిన నష్ట పరిహారాన్ని, సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ లో VRA గా పని చేస్తున్న మాడుగుల మొండయ్య 8లక్షల పరిహారం చెల్లించారాని పేర్కొన్నారు.సర్వే నం : 124,164 బోనాల శివారు భూమిని అప్పుడున్న అధికారుల అండ దండలతో కొంతమందికి తీసుకున్నారని, ఈ విషయంలో 3కోట్ల కుంభ కోణం జరిగిందని ఆరోపించారు.సిరిసిల్ల పట్టణం,సంజీవయ్య నగర్ లో బిట్ల పోచ్చయ్య కు సర్వే నం :1585 లో 26.1/2 గుంటల భూమి తాను ఉన్నప్పుడే అమ్మేసి 2018 మరణించడని, కాని అతని పేరు పై 7.1/2 గుంటల భూమి ఉన్నట్టు ఓ కేసు విషయమై కోర్ట్ లో ధాకాలు చేసారని, దాని నకలు కావాలని RTI ద్వారా అడిగితే, వారి వద్ద రికార్డు లేదని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తుందని, ఇలా అనేక  తప్పులు చేస్తూ , అక్రమాలకు అడ్రస్ గా నిలుసుతున్న పలువురు ఎమ్మార్వో పై విచారణ చేయని పక్షంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాగుల రాములు మాల మహానాడు జాతీయ కార్యదర్శి,గుంటి వేణు సీపీఐ జిల్లా కార్యదర్శి,బొజ్జ కనుకయ్య టి జె ఎస్ జిల్లా అధ్యక్షులు,బుస్స వేణు జిల్లా పరిరక్షణ వేదిక అధ్యక్షులు,తుంగ శివరాజ్ మాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్,సోమ నాగరాజు సీపీఐ జిల్లా నాయకులు, మనోజ్ కుమార్ టిడిపి పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జ్,దళిత నాయకులు నీరటి సుధీర్,దాసరి సురేష్,మాసం శంకర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

October 2024
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading