
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 15, 2024.
సిరిసిల్ల మున్సిపల్ ల్లో 266 మంది లేబర్ లు, 10 మంది జవాన్ లు, 37 ట్రాక్టర్లు,10 మినీ ఆటోలు ఇంతమంది, ఇన్ని సదుపాయాలున్న రోడ్డు పై మరణించి, కుళ్ళి పోతున్న కుక్క ను తొలగించ లేకపోతున్నారు. పట్టణాన్ని పరిశుభ్రం గా ఉంచాల్సిన సదరు మున్సిపల్ పారిశుధ్య ఇన్స్పెక్టర్, కేవలం ఉదయం పూట కార్మికుల హాజరు తీసుకోవడం తోనే తన పని అయిపోయిందన్నట్లు గా వ్యవహరించడం శోచనీయం.జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో, పాత బైపాస్ రోడ్డు పై, పైగా అదే దారిలో కలెక్టర్, మినిస్టర్ ల వాహనాలు వెళుతుంటాయానే భయమే లేదంటే, సామాన్య జనాల పట్ల వీరి వైఖరేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.”నేటి భారతం” సిరిసిల్ల మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ పని తీరు పై ప్రజలకు తెలియజేస్తున్న ఈ సమస్య కు చైర్పర్సన్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి మరి.











Leave a Reply