• అనధికారా సంఘాలకు 10లక్ష ల రుణాలు.
• క్లస్టర్ పరిధి దాటి అనధికారా సంఘాలకు లోన్ లు మంజూరి అయ్యేలా సంతకాలు చేస్తున్న మెప్మా సి. ఓ లు…,?
• hdfc బ్యాంక్ సేల్స్ ఆఫిసర్ కు తెలిసి జరుగుతున్న తంతు పై అనుమానాలెన్నో…?
• ఛైర్పర్సన్ కు తెలిసిన మౌనమెందుకు…?
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 16, 2024.
పట్టణంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, ఆర్థిక స్వాలంబన సాధించేదిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ “మెప్మా’ (పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ). గత ప్రభుత్వాలు మెప్మా కు పెద్ద పీట వేసి, మహిళల అభివృద్ధికి బాటలు వేసాయి.కాని నేడు సిరిసిల్ల మున్సిపల్ సంస్థ పరిధి లోని “మెప్మా” సంస్థ లో పలువురు సిబ్బంది చర్యల వల్ల “మెప్మా’కు మసంటుకొంటోందనే అనుమానాలు కలుగుగున్నాయి.క్షేత్ర స్థాయిలో ‘నేటి భారతం’ సేకరించిన వివరాల ప్రకారం,ఆన్లైన్ MCP(micro credit plane )లేనిదే మహిళా పొదుపు సంఘాలకు లోన్ లు ఇవ్వరాదు.కాని సిరిసిల్ల “మెప్మా”లో ని కొందరు సి. ఓ లు ఎలాంటి MCP లు చేయకుండా సిరిసిల్ల HDFC బ్యాంక్ సేల్స్ ఆఫిసర్ సహకారాల తో, ఓ గ్రూప్ తయారు చేసి, ఒక గ్రూప్ కు 10లక్షలు లోన్ ఇప్పిస్తున్నట్టు విశ్వాసనీయ సమాచారం.ఇలా గడిచిన 6 నెలలలో 30 గ్రూప్ లకు 3 కోట్ల రుణాలు అందించారు. ఈ తంతు జరగడానికి ఒక్కొక్క గ్రూప్ నుండి సదరు బ్యాంక్ సిబ్బంది సి. ఓ లకు 10వేల రూ “లు ఇస్తున్నట్టు మిగతా క్లస్టర్ లోని సంఘాల R. P లు చర్చించుకుంటున్నారు.ఈ తంతు వల్ల ఒక మహిళా సంఘం ఆన్లైన్ ద్యారా ఓ బ్యాంక్ లో లోన్ పొందినప్పటికీ, hdfc బ్యాంక్ లో మరల లోన్ పొందే ప్రమాదమున్న,పలువురు సి. ఓలు లంచలకు మరిగి ఇలాంటి రుణాలు ఇప్పిస్తున్నారని పేరు తెలుపడానికి ఇష్టపడని ఓ సంఘం ఆర్. పిలు తెలిపారు. ఈ తతంగమంతా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కు తెలిసినా మౌనంగా ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కథనం వెలువడిన అనంతరమైన మున్సిపల్ చైర్పర్సన్, మెప్మా ను ప్రక్షాళనం చేస్తారా…? అక్రమార్కులకు గుణపాఠం నేర్పుతారా…?వేచి చూడాలి.











Leave a Reply