సంతాపం తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్.

Published by

on

సంతాపం తెలుపుతున్న  సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్, కమీషనర్ ‘మెప్మా’ సి. ఓ లు, ఆర్. పి లు, సభ్యులు తదితరులు.

‘నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

Oct 17, 2024.

 రాజన్న సిరిసిల్ల కేంద్రం లోని పురపాలక సంఘ కార్యాలయం లో మెప్మా విభాగం లో టిఎంసి గా విధులు నిర్వహిస్తున్న గుడిసే రాజమణి గురువారం అకాల మరణం చెందగా,నేడు మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘ లో సంతాప సభ ఏర్పాటు చేయగా, చైర్పర్సన్ జిందం కళ, కమీషనర్ లు పాల్గొని సంతాపం  తెలిపారు.అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో టీఎంసీగా  రాజమణి  ఏడు సంవత్సరాలుగా సిరిసిల్లలో విధులు  నిర్వహిస్తూ, మహిళా సంఘాల అభివృద్ధికి, మహిళల ఆర్థిక స్థిరత్వానికి,ఎంతగానో కృషి చేశారని అన్నారు. తోటి ఉద్యోగులు,తన కిందిస్థాయి సిబ్బందితో స్నేహపూర్వకంగా, అందరితో కలిసి పని చేసేవారని గుర్తు చేసారు.రాజమణి ఇద్దరి చిన్నపిల్లలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని భావోద్వేగానికి లోన్నైయ్యారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ మీర్జా ఫసహత్ అలీ బెగ్,పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

October 2024
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading