ఓ ప్రభుత్వమా…ఇది మీకు న్యాయమా…?

Published by

on

‘నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

Oct 19, 2024.

అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడి,ఇప్పుడు బిల్లుల కోసం దిక్కుకులు చూస్తున్నామని  సర్పంచ్ ల పొట్టకొట్టడం ఓ ప్రభుత్వమా….ఇది మీకు న్యాయమా అని మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్ అన్నారు. మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద రిలే నిరాహార దీక్ష 2డవ రోజు కార్యక్రమంలో భాగంగా కరుణాకర్ మాట్లాడుతూ! గ్రామాభివృద్ధి లో కీలక భూమికైనా మేము, ఆస్తులన్నీ అమ్ముకొని గ్రామాలను అభివృద్ధి చేసి బిల్లులకై  ఎదురుచూస్తున్నామన్నారు.మన ఊరు మన బడి, మిషన్ భగీరథ, EGS, 15th finance, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(sdf), కన్స్టిట్యూయన్స్ డెవలప్మెంట్ ఫండ్(cdf), మొదలైన కార్యక్రమాలకు సంబందించిన బిల్లు లు రావాల్సి ఉందన్నారు.పదవి కాలం మరింత ఉన్న, అప్పటివరకైనా వస్తాయానే ఆశ ఉండేదని, ప్రస్తుతం పదవి కాలం ముగిసి, ప్రత్యేక అధికారుల పాలన సాగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో పెండింగ్ బిల్లులు ఎలా వస్తాయోననే ఆందోళనలో తాజా మాజీ సర్పంచులున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను మంజూరి చేయాలనీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుమ్ము అంజయ్య, ఉపాధ్యక్షులు గణుప శివజ్యోతి, కార్యర కోల నర్సయ్య ఏనుగుల కేశవ రావు, గాండ్ల సుమతి, తాడెపు ఎల్లం, కె. వెంకట నర్సింహా రెడ్డి, లక్ష్మణ్ పలు గ్రామాల మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

October 2024
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading