• సిరిసిల్ల HDFC బ్యాంక్ రుణాల టార్గెట్ చేరుకోవడానికే డిజిటల్ mcp లేని రుణాలు.
• MCP చేయకుండా లోన్లు పొందుతున్న వారిలో అర్హులెందరు.? అయినవారేందరు?
• సిరిసిల్ల HDFC అవలంబిస్తున్న తీరుతో సి. ఓ ల అనుగ్రహం ఉన్నవారు రెండు చోట్ల లోన్ లు పొందే అవకాశం…?
• మొన్నటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా మెప్మా పి. డి గా సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ ఉండగా, నేడు ఎవరు లేనందునే అక్రమ లోన్ లకు తెరలేపిన కొంతమంది సి. ఓ లు
‘నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 19, 2024.
మెప్మా నిబంధనలకు విరుద్దంగా, MCP(micro credit plane ) లేకుండా సిరిసిల్ల మున్సిపల్ లోని కొంతమంది మెప్మా సి. ఓలు ఇప్పిస్తున్న లోన్ లు అర్హులకా….? అయినా వారికా…? అనే అనుమానాలు కలుగుతున్నాయి.మహిళ పొదుపు సంఘాల సభ్యులు బ్యాంక్ ద్వారా రుణాలు పొందాలంటే, మెప్మా ఆర్. పి లు పదిమంది గ్రూప్ సభ్యుల పూర్తి వివరాలు ఇవ్వగా, సి. ఓ లు పరిశీలించి, ధ్రువీకరించి ఆన్లైన్ లో mcp చేయగా,సదరు బ్యాంక్ కు అ సభ్యుల లిస్ట్ TMC పంపాల్సి ఉంటుంది.కాని సిరిసిల్ల HDF బ్యాంక్ సేల్స్ ఆఫిసర్ MCP లేకుండానే, బ్యాంక్ టార్గెట్ చేరుకోవడానికి, offline లో రుణాలు ఇప్పుస్తున్నారు.ఈ offline విధానం వల్ల సి. ఓ లను ప్రసన్నం చేసుకుంటే,ఇతర బ్యాంక్ లో ‘లోన్’ లు పొందిన వారు, లేదంటే డమ్మి సభ్యులు సైతం 10 లక్షల లోన్ లు పొందే అవకాశాముంది.10 లక్షలకు EMI గా దాదాపు 30 వేలు ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది.30వేల EMI ని రెండు భాగాలుగా 15వేలు, 15వేలు చేస్తే చిన్న EMI యే కనుక ఈ 10 లక్ష ల లోన్ ను ఇద్దరే వాడుకునే అవకాశము లేకపోలేదు.ఈ వ్యవహారమంతా మెప్మా నిబంధలకు విరుద్ధం కనుక సి. ఓలకు అనుకూలంగా ఉన్న వారికే లోన్ లు వచ్చే అవకాశం ఉంటుందని పలువురు ఆర్. పి లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పది మంది పేద మహిళలకు చెందాల్సిన డబ్బు కేవలం ఇద్దరు లేదా సి. ఓ లు నచ్చిన్నవారు పొందడం “మెప్మా”లక్ష్యాలను దెబ్బ తీస్తుంది. పేద మహిళలకు చెందాల్సిన ప్రభుత్వ డబ్బు పలువురు సి. ఓ ల అత్యాశ్యకు పక్క దారి పడుతుంది. ఈ విషయంలో మెప్మా పి. డి పూర్తి విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.











Leave a Reply