నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 19, 2024.
సిరిసిల్ల గడ్డ మీద మరోసారి మాదిగ, మాదిగ ఉపాకులాలబలం, బలగం నిరూపించుకోవడానికి తలపెట్టిన ఆత్మ గౌరవ సభ ను విజయవంతం చేద్దామని మాదిగ, మాదిగ ఉపకులాల ఐక్య వేదిక కన్వీనర్ కత్తెర దేవదాస్ పిలుపునిచ్చారు.ఈ నెల 23 బుధవారం రోజున తలపెట్టిన “ఛలో సిరిసిల్ల’ ఆత్మ గౌరవ సభ కార్యక్రమం సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమై, పాత బస్టాండ్ మీదుగా, గాంధీ నుండి,అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి గ్రామం నుండి మాదిగ, మాదిగ ఉపాకులాల ప్రజలు, యువకులు, డప్పు చెప్పుళ్లతో తరలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కానపురం లక్ష్మణ్, బొడ్డు రాములు,లింగంపెల్లి సత్యనారాయణ,బొడ్డు నారాయణ, కొట్టేపెల్లి సుధాకర్,గడ్డం కిరణ్, ఎడ్ల నరేష్, మోహన్, నరేష్, రవి, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply