“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 21, 2024.
తాజా మాజీ సర్పంచ్ల JAC కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు 4 వ రోజుకు చేరుకున్నాయి. 4వ రోజు సోమవారం దీక్షలో తాజా మాజీ సర్పంచులు కండ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలిపారు.ఈ దీక్షకు మద్దతుగా BJP పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ,MSP పార్టీ జిల్లా అధ్యక్షులు కనపురం లక్ష్మణ్, రాజన్న సిరిసిల్ల జిల్లా CPI పార్టీ అధ్యక్షులు గుంటి వేణు లు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి దుమ్మ అంజయ్య, ఉపాధ్యక్షులు గణుప శివజ్యోతి,కార్యదర్శిలు వెంకటనరసింహారెడ్డి ,పడిగల రవీందర్,గడ్ల సుమతి ,చల్ల నారాయణ, గున్నాల లక్ష్మణ్ , తాడేపు ఎల్లం, తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply