
* పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు,చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా నమోదు చేయాలి.
*పోలీస్ స్టేషన్ రైటర్లకు క్రైమ్ సీన్లో తీసుకోవాల్సిన చర్యల పై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం.
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 27, 2024.
నేర చేదనలో సాక్షాదారల సేకరణ కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.నమోదు అయిన ప్రతి కేసులలో పిర్యాదు స్వీకరణ, కేసు నమోదు, ఇన్వెస్టిగేషన్,ఛార్జ్ షీట్ వరకు ఏ విధంగా చెయ్యాలి? ఏ ఏ అంశాలు క్రోడికరించాలి?నేర స్థలంలో సాక్ష్యాలు ఎలా సేకరించాలి?పంచనామా ఎలా చేయాలి? మొదలైన అంశాలపై జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ లో రైటర్లకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నేర స్థలాలు హత్య,ఆత్మహత్య ,నీటిలో దూకి ఆత్మహత్య,విషము తాగి,కరెంటు షాకు, పాము కాటుతో మరణించిన సందర్భాలను మనిషి కృత్రిమ రూప ఆకృతుల ఆధారంగా సాక్షాదారాలు ఏ విధముగా సేకరించాలి? శవ పంచనామా ఎలా చేయాలి? నేర స్థలంలో ఏ వస్తువులు స్వాధీన చేసుకోవాలి?నేర స్థలంలో ఏ ఏ విషయాలు గమనించాలి? సాక్షుల వాంగ్మూలం ఏవిధంగా నమోదు చేయాలి?ఫోరెన్సిక్ లైబరేటరీకి ఎం ఎం పంపించాలి అనే అంశాలపై శిక్షణ ఇప్పించ్చారు .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,నేర చేదన లో సాక్షదారాలు సేకరించడం కీలకమని, సాక్షాల వల్ల నేర నిరూపణ జరిగి నిందితులకు శిక్షలు పడే విధంగా చేయవచ్చని తెలిపారు.పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు, చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేసి కోర్టులలో నిందుతులకు శిక్షలు పడే విధముగా కృషి చేయాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీసీఆర్బీ సి.ఐ శ్రీనివాస్, పిసిఆర్ సి.ఐ మధుకర్, డీసీఆర్బీ ఎస్.ఐ జ్యోతి, పోలీస్ స్టేషన్ల రైటర్స్ పాల్గొన్నారు.
కృత్రిమ మనిషి ఆకృతులతో క్షేత్ర స్థాయిలో సూచనలిస్తున్న sp అఖిల్ మహాజన్.











Leave a Reply