“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 28, 2024.
డయల్ యువర్ ఆర్టీసీ డిఎం ప్రోగ్రాం కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. సోమవారం ఉ “11గ నుండి 12గ o ల వరకు నిర్వహించిన డయల్ యువర్ ఆర్టీసీ డిఎం ప్రోగ్రాకు 15 విజ్ఞప్తులు వచ్చాయని డిపో మేనేజర్ ఏ.ప్రకాష్ రావు తెలిపారు.విజ్ఞప్తులలో ముఖ్యంగా ముచ్చర్ల గ్రామానికి బస్ లు పంపాలని,సిరిసిల్ల నుండి నిర్మల్ కు, కాలేశ్వరం నుండి కాకినాడకు,కొత్త బస్సు సౌకర్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు,సిద్దిపేట డిపో, వేములవాడ డిపో బస్సులు సిరిసిల్ల కొత్త బస్టాండ్ కు రావాలని, సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల నుండి కామారెడ్డికి పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలని (మహాలక్ష్మి వలన సీట్లు దొరకడం లేనందున)ప్రయాణికులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారన్నారు. సానుకూలంగా స్పందించిన డిఎం పై అధికారులకు విజ్ఞప్తులను పంపించి సాధ్యసాధ్యాలు పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు.











Leave a Reply