“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 29, 2024.
ద్విచక్ర వాహనం దొంగిలించిన కేసులో ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు 100 రూ ల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ ఒక
ప్రకటనలో తెలిపారు. ఎస్.ఐ తెలిపిన వివరాల ప్రకారం,ముస్తాబాద్ లో బకెట్ బిర్యాని హోటల్ యజమాని తన్నీరు నరేందర్ రావు ఆగస్టు 17, 2023 న తన హోటల్ ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనం చోరీ జరిగిందని ముస్తాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన పెద్దగుండావెల్లి గ్రామానికి చెందిన పంజా చందు ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. విచారణ అనంతరం అప్పటి ఎస్.ఐ. శేఖర్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ కేసు వాదించగా, కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ.రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ ఆడేపు దేవేందర్ సాక్షులను ప్రవేశ పెట్టారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ నిందితుడు పంజా చందు కి ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు 100 రూ ల జరిమానా విధించారు.











Leave a Reply