ఛైర్మెన్ ‘చైర్’ దక్కెదేవరికో…..?

Published by

on

• స్వామి భక్తికా…సేవకులకా…?

• భవిత్వం తెలనుంది ఈ నెల 16న…!

ఫిబ్రవరి 14/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 సిరిసిల్లలో ఆద్యంతం ఆసక్తి కరంగా జరిగిన  మున్సిపల్ ఎన్నికలు  ముగిసాయి.ఇప్పుడు  పట్టణంలో చర్చంతా చైర్మన్ ‘చైర్’  గురించే.ఎవరికి చైర్ ?ఎప్పటిలాగే స్వామి భక్తిని వరిస్తుందా…? లేదా సేవకులను గుర్తిస్తుందా…?BRS పార్టీ ఆవిర్భావo నుండి కాకున్నా , తెలంగాణ ఉద్యమం నుండి పార్టీ లో   క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకుల సతీమణులు 4 గురు ‘చైర్’ను ఆశిస్తున్నట్టు సమాచారం. వీరిలో 3 వ వార్డ్ నుండి గెలుపొందిన జిందం చక్రపాణి సతీమణి జిందం కళ, 5 వ వార్డ్ నుండి గెలుపొందిన  దార్నo లక్ష్మినారాయణ సతీమణి  దార్నoఅరుణ,30 వ వార్డ్ నుండి గెలుపొందిన మంచె శ్రీనివాస్ సతీమణి రేణుక,17 వ వార్డ్ నుండి గెలుపొందిన గుండ్లపెల్లి పూర్ణచందర్ సతీమణి నీరజ ఉన్నారు.వీరిలో జిందం చక్రపాణి సతీమణి జిందం కళకు స్వామి భక్తి ఎక్కువగా ఉన్నదని కొందరు, గత సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా పదవి చేపట్టినందున అవకాశం ఉండకపోవచ్చని మరికొందరు భావిస్తున్నారు.2014 నుండి BRS పార్టీతో, పార్టీ లో విశ్వాసంగా, క్రియాశీలకంగా ఉన్న దార్నo లక్ష్మినారాయణ సతీమణి  దార్నoఅరుణ కు సానుకూలంగా వాతావరణం ఉన్నట్లు కనిపిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.మంచె శ్రీనివాస్ సతీమణి రేణుక పూర్తి వ్యాపార నేపథ్యమున్న కుటుంబం. పాలనలో  అ విధమైన శైలి సరైన ఫలితాలు రాబట్ట లేకపోవచ్చని చర్చ జరుగుతుండగా, ఎంత ఖర్చుకైనా ముందువరుసలో ఉంటారని చైర్ వారిని వరిస్తుందని మరికొందరు అంటున్నారు. సిరిసిల్ల ఛైర్పర్సన్ గుండ్లపెల్లి నీరజ అంటూ పట్టణంలో ప్రచారం జరుగుతున్న, BRS పార్టీనుండి 3 సార్లు కౌన్సిలర్ గా గెలిచిన కుటుంబంగా పేరున్న..! సీనియర్ లను కాదని నీరజకు అవకాశం ఇస్తారా…? అనే ప్రశ్న వినిపిస్తుంది .పైగా కేటీఆర్ ఆశీర్వాదంతోనే అంచలంచెలుగా రాజకీయాల్లో ముందడుగు వేస్తున్న గుండ్లపెల్లి పూర్ణచందర్ కేటీఆర్ చెబితే వింటాడని  ఆ పార్టీ శ్రేణుల్లోని పలువురి నాయకుల అభిప్రాయం.

వైస్ ఛైర్మెన్ 

———-

సిరిసిల్ల లో ఎన్నికైన 27 మంది BRS కౌన్సిలర్ లలో  BRS పార్టీ లో క్రియాశీలకంగా విశ్వాసం గా, విధేయులుగా 3సార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన వారు దార్ల సందీప్,(దార్ల సందీప్ 2,దార్ల కీర్తన 1 సార్లు), గుండ్ల పెల్లి నీరజ (పూర్ణచందర్ 1, నీరజ 2 సార్లు ), బుర్ర నారాయణ,దళితులకు ప్రాముఖ్యత ఇవ్వాలని పార్టీ భావిస్తే  8వ వార్డ్ నుండి కౌన్సిలర్ లింగం పెల్లి భాగ్య లక్ష్మి ముందు వరుసలో ఉన్నారు.పార్టీ పెద్దలు  అభ్యర్థుల్లో క్రియాశీలత, విధేయత గుర్తిస్తే దార్ల సందీప్ కు వైస్ ఛైర్మెన్ చైర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సిరిసిల్ల పట్టణంలో చర్చకు తెర లేసింది.

Leave a Reply

February 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading