

ఫిబ్రవరి 27/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు కేటాయించింది.అన్నారు.శనివారం సిరిసిల్ల మున్సిపల్ లో చైర్పర్సన్ జిందం కళ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు మంజూరికి ఆమోదం తెలిపింది.విద్యానగర్, నెహ్రు నగర్ లోని వైకుంఠదామాలలో దహన సంస్కారాలను 101/-లకేనిర్వహించడానికి16.80లక్షలు,వార్డుల వారీగా స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహించడానికి 10.00 లక్షలు,వివిధ వార్డులలో పవర్ బోర్లు నిర్మించుటకు రూ.10.00 లక్షలు,స్ట్రీట్ లైట్స్ నిర్వహణకు 5లక్షలు,లేబర్ యూనిఫార్మ్స్, గ్లోవ్స్, మాస్కులు, డ్రెస్,ట్రాక్టర్ రిపేర్ ఇతరాలకు 11.20 లక్షలు, రంజాన్ మాసం సందర్బంగా ఈద్గాల వద్ద మౌలిక వసతుల కల్పనకు 3లక్షలు కేటాయిచ్చినట్లు చైర్పర్సన్ తెలిపారు.
శానిటేషన్ కు 10లక్షలు……?
గత పాలక వర్గం లోCDMA(commissioner &director of municipal administration )ఆదేశాల ప్రకారం జనాభా దమాషా పారిశుధ్య కార్మికులను భర్తీ చేసుకోవడానికి అనుమతి ఉందని,భారీగా పారిశుధ్య కార్మికులను అప్పటి చైర్పర్సన్ (ఇప్పుడున్న ఛైర్పర్సన్ )ఆధ్వర్యంలో భర్తీ చేసుకున్నారు.వారందరు వారి వారికి కేటాయించిన వార్డ్లలో విధులు నిర్వహిస్తుండగా, తిరిగి ఇదే శానిటేషన్ విభాగనికి 10 లక్షలు కేటాయించడం వృధా యేనని నేటి భారతం భావిస్తుంది.అసలే బడ్జెట్ సమస్యతో ఉన్న సిరిసిల్ల మున్సిపల్లో ఇలా వృధా ఖర్చులు సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











Leave a Reply