గస్తీ లేకనే ఘర్షణలు….?

Published by

on

మార్చి 01/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాత్రివేళ పోలీసుల సరైన గస్తీ లేకనే ఘర్షణలు చెలరేగుతున్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మొన్న అర్ధ రాత్రి బి. వై నగర్ శివారులో ఒక యువకుని పై 8మంది యువకులు దాడి చేయడం జిల్లా లో చర్చనియా అంశంమైంది. పట్టణ శివార్లలలో యువకులు గుంపులు గుంపులుగా ఉంటూ మద్యం, గంజాయి లాంటి వాటిని స్వీకరిస్తూ, మత్తులో తేలుతూ ఇలా దాడులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల పట్టణంలో బి వై నగర్, గణేష్ నగర్, నెహ్రు నగర్ గుడి పరిసర ప్రాంతం,కొత్త బైపాస్ ఏరియా,శాంతినగర్,అంబేద్కర్ నగర్,కలెక్టరేట్ వెనుక భాగం నిర్మానుష్య ప్రాంతంలో యువకులు రాత్రి వేళ గుంపులుగా తిరుగుతుంటారని, రాత్రి వేళ సరైన గస్తి కాస్తే ఇలాంటి అల్లర్లు జరిగే అవకాశం ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వ్యసనాలకు అలవాటు పడ్డ యువకుల వల్ల,  వేసవి సెలవుల్లో సొంత ఇళ్ళకు వచ్చే విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంటుందని, ఇకనైనా జిల్లా పోలీసు యంత్రాంగం రాత్రివేళ సమస్యాత్మకమైన ప్రాంతాల పై నిఘా పెంచుతూ, గస్తీ ఏర్పాట్లు కఠిన తరం చేయాలని జిల్లా ఎస్పీని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

March 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading