ఆదాయం కోసం   అనవసరపు మాత్రలు…..?

Published by

on

• తనిఖీలు  లేకనే  రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా.

• ఫిర్యాదు చేస్తే మెడికల్ మాఫియా కు లీకులు ఇస్తున్న అధికారులు….?

• నేటికి అందుబాటులో లేని డ్రగ్ ఇన్ స్పెక్టర్ .

నేటి-భారతం(ప్రశ్నించడమే పరిష్కారం) ,రాజన్న సిరిసిల్ల  :   

 రాజన్న సిరిసిల్లా జిల్లాలో  ఆదాయం కోసం ఆసుపత్రి యాజమాన్యల తీరు పై “నేటి భారతం” ప్రత్యేక కథనం…….

ఆదాయం కోసం వైద్యులచే అనవసరపు మాత్రలు రాయిస్తున్న మెడికల్ మాఫియా. ఆరోగ్యంపై ప్రజలు చూపుతున్న శ్రద్దను ఆసరాగా చేసుకుని,  సందుకో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తూ, వైద్యం పేరిట ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాగా రూపాంతరం చెందడమే తడువుగా ఐదుగురు కలిసి 25 లక్షలు వేసుకొని ఆస్పత్రి ఏర్పాటు చేసి, ఆదాయమే లక్ష్యంగా వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. ఈ తంతు జిల్లా కేంద్రంలో అత్యధికంగా సాగగా, అధికార పార్టీ నాయకుల అండదండలతో మండల కేంద్రాలలో సైతం ఈ మాఫియా   వ్యాపారాన్ని విస్తరింప జేస్తోంది. 

వివరాల్లోకెళ్తే అతనో యువకుడు,విద్యావంతుడు. తన తలకి గతంలో పలు చిన్న ,చిన్న గాయాలవ్వడం వల్ల అప్పుడప్పుడు తల తిప్పినట్లు అనిపించడంతో, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు.  యువకుడి సమస్యలను అడిగి తెలుసుకున్న డాక్టర్ వెంటనే ఎం ఆర్ ఐ బ్రేన్, తీసుకువచ్చాక చూద్దామని తెలిపారు. ఏం ఆర్ ఐ  పరిశీలించిన డాక్టర్ ! ఏం ఆర్ ఐ లో ఎమీ లేదని,అంత బాగానే ఉందని,  తగు మాత్రలు రాస్తా,వాడితే సరిపోతుందని పేర్కొన్నారు. రాసిన మందుల  చీటీని అదే ఆసుపత్రిలోని మెడికల్ షాప్ లో చూపించగా, డాక్టర్ రాసిన మొత్తం మందులకు 3 వేల రూపాయలు అవుతాయని సదరు మెడికల్ యజమాని తెలపడంతో,తానో సారి మందులను చూస్తానని తెలిపిన యువకుడు, తనకు రాసిన 4 రకాల మాత్రలలో రెండు మాత్రల ఫార్ములాలు ఒకే రకంగా  ఉన్న వాటి కంపెని పేర్లు వేరుగా ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వివరించగా! ఓ ….రెండు ఓకే విధంగా రాసానా ! అంటూ  తాను రాసిన 4రకాల మాత్రలను 3 రకాలకు కుదించాడు. ఇలా డాక్టర్ కుదించిన ఒక రకం 10 మాత్రలకు 517రూ” ఉండటం గమనర్హం. ఇలా రోజువారిగా  అ  ఆసుపత్రికి  20 మంది రోగులు వచ్చిన,  ఒక్కొక్క రోగికి అనవసరంగా రాస్తున్న  మాత్ర విలువ 517గా,మొత్తంగా10,340 అవుతుంది.  ఇలా ఒక నెలకు 3,10,200 రూ” కేవలం మందుల ద్వారా వీరికి సమకూరే ఆదాయం. 

 పిర్యాదు చేద్దామంటె అధికారేడి……..?

ఆదాయం  కోసం వృతి ధర్మాన్ని మరచిన కొంత మంది డాక్టర్లు, ఆసుపత్రి యజమానులతో చెతులు కలిపి  మందుల పేరిట ప్రజలను నిలువు దొపిడి చెస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళదామంటే , డ్రగ్ ఇన్ స్పెక్టర్ అందుబాటులో లేరు? ఉన్న ఏక్కడుంటాడో తెలియదు. ఒకవేళ జిల్లా కలెక్టర్ కు తెలుపుదామంటే ఆయన  సామాన్యుల సమస్యలు వినేది కేవలం “ప్రజావాణి”లోనే మరి ఇలాగైతే  సామాన్యులు ఇలా  ప్రతి నిత్యం నిలువుదోపిడికి గురికావాల్సిందేనా? సిరిసిల్లా జిల్లా అయిన నేటికి డ్రగ్ ఇన్ స్పెక్టర్ పూర్తి స్థాయిలో అందుబాటులో  లేకపోవడం ఎవరి వైఫల్యం..? ఆలోచించండి…ప్రశ్నించండి…..ప్రశ్నతోనే పరిష్కారం లభిస్తుంది.

Leave a Reply

October 2023
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading