నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :
ఏవరి విధులు వారు సక్రమంగా నిర్వహిస్తే పత్రికలకు పనేముంటుంది..? తెలంగాణ రాష్ట్ర సి.ఎం ప్రజా ఆశీర్వాద సభ సిరిసిల్లా పాత బైపాస్ వద్ద గల మైదానంలో నిర్వహించారు. అంతబాగానే ఉన్న అ సభ అనంతరం మైదానమంత ప్లాస్టిక్ వ్వర్థాలతో నిండిపోయి ఉంది. ఈ వ్యర్థారను తొలగించాల్సిన సిరిసిల్లా మున్సిపల్ సంస్థ అ పని మాది కాదనట్టు వ్యవహరిస్తుంది. ఏవరో ఒకరు పత్రికల్లో రాస్తే తప్ప స్పందించన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ సంస్థ! పట్టణ జనాభాకు అనుగుణంగా,పట్టణ పరిశుభ్రత కొరకు సి.డి.ఎం.ఏ నిబంధనల ప్రకారం,వారి ఆదేశాల మేరకు కార్మికులను ,వివిధ రకాలైన సిబ్బందిని 350 మందిని నియమించుకుంది. అయిన పరిశుభ్రత విషయంలో సంస్థ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందో ప్రజలు ఆలోచించాలి.మనకెందులే అని ప్రజలు అనుకొవడం వల్లే అధికారులు ,నాయకులు మొద్దు నిద్రలో ఉన్నారు. అందుకే ప్రజలు,యువకులు సామాజిక మాధ్యమాల ద్వారా మీ వాణి వినిపించాలని “నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం)ఆకాంక్షిస్తుంది.











Leave a Reply