ఆగన్న రమ్మంటుండు., చక్రన్న వద్దంటుండు…?

Published by

on

•టిఆర్ ఎస్ పార్టి అగ్రనాయకుల అనాలోచన విధానాలు పార్టికి నష్టం చేస్తుందని మరిచారా…?

• ఇప్పటికే పద్మశాలి, బి.సి యువతను ఆకర్షించిన  పత్తిపాక సురేష్ .

• బి.సి ల ఆత్మగౌరవమే నా ఎజెండా ..అంటున్న సురేష్ బిఆర్ ఎస్ లోకి వెళ్ళేనా…..?

• సురేష్ ను  పార్టిలో చేర్చుకోవడం వల్ల లాభమే గాని నష్టంలేదంటున్న రాజకీయ విశ్లేషకులు.

నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : 

 రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.మొన్నటిదాక  టిఆర్ ఏస్ లో ఉన్న నాయకులు కాంగ్రెస్ లోకి,కాంగ్రెస్ లో ఉన్న నాయకులు టిఆర్ ఏస్ లోకి  మారుతూ,పార్టి ల గెలుపు ఓటముల పై అంచనాలు మలుపు తిప్పుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నడు లేనంతగా ఈ యేడు అసెంబ్లి ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో  ప్రజలు,నాయకులు బి.సి రాగం ఆలపిస్తున్నారు. మరో వైపు అతి స్వల్ప వ్యవధిలోనే ఇటు బి.సి యువతను,అటు పద్శశాలిలను ఐక్యం చేస్తూ ,ప్రజల్లో భారీ చర్చకు దారితీస్తున్న యువ నాయకుడు హిందు సాంస్కృతిక సమితి రాష్ట్ర అధ్యక్షులు పత్తిపాక సురేష్ .సురేష్ కార్యకలపాల పై ఇప్పటికే జిల్లా కేంద్రంలో  సురేష్  సొంత కమ్యూనిటిలోనే తీవ్ర చర్చ జరుగుతోంది. సురేష్ కార్యాకలపాల వల్ల ఒకనోక దశలో సొంత కమ్యూనిటిలోని అగ్రనాయకులు బహిరంగంగా అసహనాన్ని వెళ్ళగక్కి బూతు పురాణం చదివిన సందర్భాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ , పద్మశాలిల ఆత్మగౌరవం,బి.సిల ఐక్యతను నెలకొల్పడానికి నేను సైతం రాబోయే ఏన్నికల్లో పాల్గొంటానని,తనను ఆశీర్వదించాలని పత్తిపాక సురేష్ వర్మ తన అభిప్రాయాన్ని ప్రకటించడంతో  జిల్లా కేంద్రంలో గందరగోళం మొదలైంది.

పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లగిశేట్టి శ్రీనివాస్ ఒ పక్క రాబోయే ఏన్నికలకు సమయాత్తం అవుతుండగా,మరోపక్క అదే సామాజిక వర్గానికి చెందిన సురేష్ వర్మ పట్టణంలోని యువతను,పెద్దలను ప్రసన్నం చేసుకొనే పని మొదలుపెట్టడం ప్రారంభించారు.అదేవిధంగా అతి స్వల్ప తేడాతో కేటిఆర్ పై ఓడిపోయిన కె.కె మహేందర్ రెడ్డి, తన అభిమానులను,అనుచరులను,తన సానుభూతి పరులను  కూడగట్టుకొని రానున్న ఏన్నికల్లో విజయ ఢంక మోగించే పనిలో ఉండగా, సిరిసిల్లా నియోజకవర్గం,బిఆర్ ఎస్ నుండి బరిలో నిలిచి ఏప్పటిలాగే విజయం సొంత చేసుకోవాలని ,మంత్రి కేటిఆర్  పావులు కదుపుతున్న సమయంలో  జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టి అగ్రనాయకులు తీరు పార్టికి తీవ్ర నష్టం వాటిల్లేలా కనిపిస్తుంది.

చక్రన్న వద్దంటుండా…..?

రాజన్న సిరిసిల్లా జిల్లాలో  మొత్తం 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో సిరిసిల్లా ఏప్పుడు ప్రత్యేకమే. దానికి తోడు మంత్రి కేటిఆర్ నియోజకవర్గం కావడం మరి ప్రత్యేకత సంతరించుకొంది.సిరిసిల్లా నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 2,40,798 మంది కాగా, కేవలం సిరిసిల్లా పట్టణంలోనే 1లక్ష మంది ఓటర్లు ఉండగా అందులో 90 వేలు పద్మశాలి సామాజిక వర్గానివే ఉంటాయి. ఇదిలా ఉండగా, ఈ ఓట్లను  ఏవరు చీల్చిన  ఏన్నికల భరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్ గందరగోళంగా మారడం ఖాయం.ముఖ్యంగా టిఆర్ ఎస్ పార్టి కి ఇప్పుడున్న పరిస్థితులలో కొంత ముప్పు పొంచి ఉందనేది రాజకీయ  విశ్లేషకుల అంచనా.టిఆర్ ఏస్ అంటేనే ముక్కు విరుస్తున్న లగిశెట్టి,పద్మశాలి,బి.సిలను ఆకర్షిస్తున్న సురేష్ వర్మ, ఇద్దరు పద్మశాలిల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం పుష్కలంగా ఉంది.ఇదిలా ఉండగా! కాంగ్రెస్ కు తరలా నుండి అభిమానం చాటుతున్న దళితుల ఓట్లన్ని కాంగ్రెస్ వైపుకు మళ్ళతాయనడంలో సందేహం లేదు. బిజేపి సిరిసిల్లా టిక్కెట్ రాణి రుద్రమకు కేటాయిస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, మొదటి నుండి టిఆర్ ఏస్ పై ముభావంగా ఉన్న లగిశేట్టి ,మనఃసాక్షి చంపుకొని తిరిగి టిఆర్ ఎస్ కు వెళ్ళడమనేది కల్ల.తటస్థంగా ఉన్న అంతర్గతంగా కాంగ్రెస్ వైపుకు సానుకులంగా ఉండే అవకాశాలే ఏక్కువ.

ఈ సమయంలో అతి తక్కువ సమయంలో బి.సి యువతను, పద్మశాలిలను ఆకర్షించిన సురేష్ వర్మను టిఆర్ ఎస్ లోకి తీసుకోవడమే ఉత్తమం.కాని సురేష్ కార్యకలపాలు ,తనకు వస్తున్న ఆధరణ చూసి పట్టణంలోని పలువురు అగ్రనాయకులు జీర్ణించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ఇదే తరుణంలో సురేష్ వర్మను టిఆర్ ఎస్ లోకి పట్టుకొస్తానని పార్టి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సన్నాహాలు చేస్తుంటే, పార్టి పట్టణ అధ్యక్షులు చిందం చక్ర పాణి వద్దంటున్నాడని, సురేష్ కిచ్చే ఆధరణే మన యువ విభాగం నాయకులకిస్తే భ్రమాండంగా పని చేస్తారని అంటున్నట్లు సమాచారం.ఏది ఎలా ఉన్న ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టిలో విపరిత దోరణులు పార్టి కి నష్టం చేస్తాయే తప్ప లాభం చేయమనేది వాస్తవం.ఈ వార్త ప్రచురించిన వెలువడిన తరువాత ఆత్మగౌరవాన్ని చంపుకొని సురేష్ వర్మ టిఆర్ఎస్ కు వెళతాడా? తోట ఆగయ్య పార్టి శ్రేయస్సు కై  సురేష్ వర్మను పార్టిలో చేర్చుకొని పద్మశాలిలా ఓట్లను గంపగుత్తగా రాబట్టేనా? ఒక వేళ బిజేపి టిక్కెట్ రాని  పక్షంలో లగిశేట్టి టిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుంటాడా వేచి చూడాలి.

(కథనం….విశ్లేషణ…పట్టణంలో జరుగుతున్న తీవ్ర చర్చల ఆధారంగా.)

Leave a Reply

October 2023
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading