సిరిసిల్లా పద్మశాలిలా పయనమెటు……???

Published by

on

• బిజెపి పద్మశాలిలకు సముచిత స్థానం కల్పిస్తుందన్న నమ్మకం పై నీళ్ళు చల్లిన అదిష్టానం.

• ప్రధాన పార్టిల టికెట్ల ఖరారుతో  సిరిసిల్లా పట్టణంలో మారుతున్న రాజకీయాలు.

• బిజెపి సిరిసిల్లా టికెట్ ఆశించి భంగపడ్డ ‘లగిశెట్టి’ పయనమెటు..?

• రాబోవు ఎన్నికల్లో  ‘పద్మశాలిలా” ఆత్మగౌరవం  నిలబడేనా???

నేటి భారతం ( ప్రశ్నించడమే-పరిష్కారం) :  

 ఆస్ట్రేలియా స్పీన్ దిగ్గజం షేన్ వార్న్  వేసిన  బంతి గింగిరాలు తిరిగినట్టు రాజన్న సిరిసిల్లా జిల్లా , సిరిసిల్లా నియోజక వర్గంలోని ,సిరిసిల్లా పట్టణంలో  రాజకీయాలు అలాగే గింగిరాలు  తిరుగుతున్నాయి.  అత్యధిక ఓట్లున్న  సామాజిక వర్గం ,అసమ్మతి నాయకుల స్వరం రోజురోజుకు పెరగడం,ఆశించిన టిక్కెట్ రాకపోవడం, టెక్స్ టైల్ పరిశ్రమ  భడ వ్యాపారులు తప్ప ,  మిగతవారంత ఈసారి ఎలాగైనా పద్మశాలిల ఆత్మగౌరవం చాటాలని తాపత్రయపడటమే ఇందుకు కారణం. కారణాలేవైనా! ఈసారి ఎలాగైనా పద్మశాలిల ఆత్మగౌరవం కాపాడుకోవాలనే నినాదంతో ,టిఆర్ ఎస్ నుండీ బిజెపి తీర్థం పుచ్చుకున్న లగిశేట్టికి,సిరిసిల్లా నియోజకవర్గ బిజెపి టిక్కెట్ రాణిరుద్రమ రెడ్డికి కేటాయించడం, ఉహించని ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ సందర్భంలో లగిశెట్టి వర్గం,టిఆర్ ఎస్ అసమ్మతి పద్మశాలి నాయకుల అడుగులు ఎటువైపు పడతాయని పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతుంది.

తలో రాగమాలపిస్తున్న ‘పద్మశాలి నాయకులు.

1లక్ష మంది జనాభా కలిగి,90వేల ఓట్లున్న పద్మశాలి సామాజిక వర్గంలో,  టెక్స్ టైల్ రంగ భడ వ్యాపారులు, ఇదే సామాజిక వర్గానికి చెందిన బిఆర్ ఎస్ పార్టి అగ్రనాయకులు కారు కే మా ఓటు అంటుండగా, సిరిసిల్లా పట్టణ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బిఆర్ ఎస్ అగ్రనాయకుల తీరువల్ల   బిఆర్ ఎస్ పార్టికి చెందిన ,గొలి వెంకటరమణ,యెల్లే లక్ష్మినారాయణ, గోనే ఏల్లప్ప,దువ్వాల వెంకటేశం, ప్రస్తుత అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ రాజు “కాంగ్రెస్ ” గూటికి చేరుకున్నారు కనుక  వీరంత కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయక తప్పదు.గత 3 సం”రాల నుండే అంటిముంటనట్టుగా  బిఆర్ ఎస్ పార్టికి దూరంగా ఉన్న లగిశేట్టి, కూడ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం,తన రాజకీయ భవిష్యత్ కొరకు ,తన ఉనికి చాటడానికి,పట్టణంలోని పద్మశాలి ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.? దీనికి తొడు సిపిఐ, కాంగ్రెస్ కు మిత్రపక్షాలుగా మారడం పట్టణంలోని ఓట్ల అంచన గందరగోళంగా మారింది.ఈ నేపథ్యంలో! పద్మశాలి నాయకులే ఇలా,వివిధ పార్టిల రాగమాలపించడం  వల్ల ఓట్లన్ని చీలడం ఖాయమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

పద్మశాలీలు ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటారా…..?

సిరిసిల్లా నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న వర్గం పద్మశాలి సామాజిక వర్గం. ఈ వర్గం లోని పలువురు  సినీయర్ ,యువ నాయకులు ఈమధ్య కాలంలో “పద్మశాలీల ఆత్మగౌరవం”అంటూ కొత్త నినాదం లేవనెత్తారు.బిఆర్ ఎస్ పార్టి కేవలం సిరిసిల్లా పట్టణంలోని భడ వ్యాపారులకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తుందని,ప్రభుత్వం అందిస్తున్న ‘బతుకమ్మ చీరల”ఉపాధి వారి మాత్రమే మేలు చేస్తుందని, ఈ చీరల తయారి వల్ల 8నెలలు మాత్రమే ఉపాధి ఉంటుందని,మిగత 4 నెలలు కార్మికుల బతుకుదెరువు ఎలా? అని  గొనే ఎల్లప్ప ప్రశ్నిస్తుండగా,భడ వ్యాపారులై ఉండి,తాము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను  నడుపుతున్నామని సామాన్య ,నేతన్నలకు లభించాల్సిన విద్యుత్ సబ్సిడిని వక్రమార్గంలో అనుభవిస్తున్నారంటూ,భడ వ్యాపారుల తీరు పై చిమ్మని ప్రకాష్ కోర్టును ఆశ్రయించారు.ఇలా పద్మశాలి సామాజిక వర్గంలో కేవలం టెక్స్ టైల్, చేనేత వస్త్ర పరిశ్రమ భడ వ్యాపారులు,బిఆర్ ఎస్ పార్టి లో ఉన్నత పదవులు అనుభవిస్తున్న  భడ నాయకులు , వారి అనుచరులే బిఆర్ ఏస్ పార్టికి జై అంటున్నారు. మిగత అత్యధికులంత కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తుండగా, లగిశేట్టి వర్గీయులు తిరిగి టిఆర్ ఎస్ కు వెళితే భవిష్యత్ లో ప్రజల మధ్య చులకనౌతామనే ఆలోచన లేకపోలేదు.అందుకే వారంత చివరి వరకు ఆశ చూపి మొండి చేయ్యిచ్చిన బిజెపికి బుద్ది చెబుతారా? లేక స్వతంత్రంగా భరిలో నిలిచి పద్మశాలిలను ఐక్యం చేసి  ఆత్మగౌరవం నిలుపుకుంటారా వేచి చూడాలి.

Leave a Reply

October 2023
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading