‘బిజెపి’లో మొదలైన రాజీనామల పరంపర.

Published by

on

• పార్టిని నమ్మి మోసపోయిన నాయకులలో బయటపడుతున్న అసహనం.

• డిపాజిట్ కూడ రాని “క్యాండెట్ “కి సిరిసిల్లా  బిజెపి టిక్కెట్టివ్వడం తో బహిర్గతమైన బిజెపి-బిఆర్ఏస్ చీకటి ఒప్పందం.

• బిజేపి -బిఆర్ ఏస్ రెండు ఒకటేనని గ్రహించిన ప్రజలు.

•రెండుకు చెడ్డ రేవడిగా మారిన పలువూరి నాయకుల రాజకీయ భవిష్యత్ .

నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) :

 కింది స్థాయి నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన నాయకుడి వెంటనే నడిస్తే భవిష్యత్ లో రాజకీయ అవకాశాలు ఉంటాయని,  రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి చాలామంది యువ,సినీయర్ నాయకులు బిజెపి లోకి చేరారు.దానికి అనుగుణంగానే పార్టిలో ఉత్సహంగా పని చేసి రాష్ట్ర స్థాయిలో బిజెపి గ్రాఫ్ ఆమాంతం పెంచేశారు. ఒక దశలో బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో రాబోవు ఎన్నికల్లో ,పార్టి పదుల సంఖ్యలో సీట్లు గెలిచే అవకాశం ఏర్పడింది.అలాంటి  సందర్భంలో, బండి సంజయ్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కాదని,కేంద్ర పదవి ఇవ్వడం, ఏన్నికల సంఘం ఏన్నికల సమరానికి తేదిలు ఖరారు చేయడం,ఒక్కసారిగా  రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైన మార్పులు  చోటు చేసుకున్నాయి.ఫలితంగా సిరిసిల్లా నియోజకవర్గం బిజెపి టిక్కెట్ రాణి రుద్రమ రెడ్డికి కేటాయించడంతో, అప్పటి వరకు బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షునితో “టట్ “లో ఉన్న జిల్లా బిజెపి నాయకులు ఒక్కసారిగా విస్మయానికి గురవ్వండం వారి వంతైంది.అదిష్టానం కనీసం జిల్లా స్థాయి నాయకులతో చర్చించకుండా, నిర్ణయాలు తీసుకోవడం పట్ల జిల్లా నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పార్టికి రాజీనామాలు,దిష్టి బొమ్మల దగ్దాలు.

బండి సంజయ్ ఆధ్వర్యంలో బిఏస్పి నుండి బిజెపిలోకి వెళ్ళిన న్యాయవాది ఆవునూరి రమకాంతరావు,సిరిసిల్లా నియోజవర్గం టిక్కెట్ రాణిరుద్రమ రెడ్డి కేటాయించడంతో ,ఇన్నినాళ్ళు అదిష్టానం తనకు అముచిత స్థానం ఇస్తుందన్న ఆశ ,అడియాశ గా మారడంతో మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో  విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి,పార్టి ప్రథమ సభ్యత్వానికి,పార్టి పదవులకు తన రాజీనామ చేశారు.సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతోమంది కార్యకర్తలు చేసిన త్యాగాలను గుర్తించకుండా, స్థానిక కార్యకర్తలతో సంప్రదించకుండా, ఒంటెద్దు పోకడలతో ఏకపక్షంగా నర్సంపేటకు చెందిన రాణి రుద్రమ రెడ్డిని సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా ప్రకటించడాన్ని  తీవ్రంగా ఖండించారు. పైకి కనపడే భారతీయ జనతా పార్టీ వేరు, అంతర్గతంగా భారతీయ జనతా పార్టీలో జరిగే పరిణామాలు వేరని అసహనాన్ని వెళ్ళగక్కారు.బిఆర్ ఎస్ పార్టి నుండి సెస్ వైస్ చైర్మన్ గా ఎన్నికైనా లగిశెట్టి శ్రీనివాస్  గత కొన్ని సంవత్సరాలుగా ,బిఆర్ ఏస్ పట్ల అసంతృప్తిగా ఉండటంతో,బండి సంజయ్ హామి మేరకు బిజెపి తీర్థం పుచ్చుకొన్నారు.ఓటు బ్యాంక్ ఏక్కువగా లగిశేట్టి సామాజిక వర్గానికే ఉండటంతో,ఆయనకే ఈసారి,బిజెపి సిరిసిల్లా టిక్కెట్ వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారు.  స్థానికంగా పేరు,ఆర్థిక నేపథ్యమున్న జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు టిక్కెటివ్వకుండా, డిపాజిట్ రాదని తెలిసి  రాణిరుద్రమ రెడ్డికి టిక్కెటివ్వడం పట్ల ,జిల్లాలోని రమాకాంతరావు,లగిశేట్టి వర్గీయులలో అసహనం నెలకొని పార్టివిధనాలు,నాయకుల తీరును నిరసిస్తూ అంబేడ్కర్ చౌక్ వద్ద నిరసన,దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఇదిలా ఉండగా ! రెడ్డబోయిన గోపి సైతం బిజెపి నుండీ సిరిసిల్లా టిక్కెట్ ఆశించే ,నియోజకవర్గంలోని సిరిసిల్లా, ఎల్లారెడ్డి పెట్టలో పట్టుబిగించాడని సమాచారం. కాని నేటి పరిస్థితుల దృష్యా  ,రెడ్డబోయిన గోపి,అన్నల్ దాస్ వేణు, వేములవాడ నియోజకవర్గంలో   ఎర్రం మహేశ్ ,కుమ్మరి శంకర్, ల నుండి ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయనే దానికి  విలేకర్ల సమావేశంలో  రామకాంతరావు మాటలే సాక్షం. 

Leave a Reply

October 2023
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading