సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ద.

Published by

on

*అసెంబ్లి ఎన్నికల సందర్భంగా జిల్లాలో పటిష్ట బందోబస్తు.

* ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చేసిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు.

*శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి.

• జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ 

నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) :

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ద చూపుతామని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో 100 మంది జిల్లా పోలీస్ సిబ్బందితో , 200 మంది కేంద్ర బలగాలతో కలసి జిల్లా ఎస్పి ఫ్లాగ్ మార్చ్  కవాతును ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఎస్పీ అఖిల్ మహాజన్  మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు,ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి జిల్లాకు 200 మంది బృందంతో కూడిన కేంద్ర బలగాలు వచ్చాయని, త్వరలో మరిన్ని బలగాల వస్తాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 560 పోలింగ్ స్టేషన్స్ ఉండగా,ఇందులో 118 క్రిటికల్ స్టేషన్లను గుర్తించడం జరిగిందన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు .ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పాత నేరస్తులను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బైండోవర్ చేస్తున్నామన్నారు. జిల్లా పరిధిలోని అవసరమైన ప్రదేశాల్లో 05 చెక్ పోస్టులతో పాటు, డైనమిక్ చెక్ పోస్ట్ లు  ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అక్రమ నగదు తరలింపు వంటి నేరాలను అడ్డుకునేందుకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నమని, సరైన పత్రాలు లేకుండా నగదు తదితర వస్తువులు తీసుకెళితే సీజ్ చేస్తున్నట్లు వివరించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ లో బిఏస్ ఏఫ్  కమాండెంట్, అడిషనల్ కమాండెంట్, సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.ఐ ఉపేందర్, ఆర్.ఐ యాదగిరి, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది,బిఏస్ ఎఫ్  సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

October 2023
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading