* ఏకదిటిగా 6 ఎళ్ళు ఒకే స్థానంలో ఉద్యోగం.
* పైగా అధనపు బాధ్యతలు అప్పగింత.
* ఎన్నికల నియమావళికి విరుద్దంగా విధులు ఎలా సాధ్యం.
నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :
రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా మున్సిపాలిటిలో 6 ఎళ్ళ నుండి ఏకదిటిగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్నికల కోడ్ వర్తించదా..? అని కాంగ్రేస్ పార్టి పట్టణ అధ్యక్షులు చొప్పందడి ప్రకాష్ ,కాంగ్రెస్ పార్టి లీగల్ సెల్ బాధ్యులు కళ్యాణ చక్రవర్తి లు తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారికి చేసిన ఫిర్యాదు లో కోరారు.ఈ సందర్భంగా వారు పిర్యాదులో పేర్కొంటూ, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు జరుగుతున్న వేళ సిరిసిల్లా మున్సిపల్ లో గత 6 ఎళ్ళుగా టౌన్ ప్లానింగ్ అధికారిగా అన్సార్ ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారని,ఆయనతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నవీన్ ,వినయ్ లు ఎళ్ళు గా పని చేస్తున్నారని, వీరీ పై తగు చర్యలు చేపట్టాలని వారు రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరారు.











Leave a Reply