• ప్రపంచంలోనే అద్బుత కట్టడాలంటూ డంబాబు కొట్టిన కేసిఆర్ ,హరీష్ రావు,కేటిఆర్ లు.
• మున్నాళ్ళకే ఎందుకు కుంగిందని ప్రశ్న…?
• కేసిఆర్ ,కేటిఆర్ లను జెైలుకు పంపడం ఖాయమన్న బండి సంజయ్ ,అదిష్టానం ఏక్కడున్నారు…?
• కమీషన్ల కక్కూర్తి వల్లే కుంగిందని ద్వజం.
నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):
కేవలం కమీషన్ల కక్కూర్తి వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిదని రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టి సిరిసిల్లా నియోజకవర్గ ఇంచార్జ్ కె.కె మహేందర్ రెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 60 ఏళ్ళలో కాంగ్రేస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న,కేసిఆర్, కేటిఆర్ లకు కాంగ్రెస్ పార్టి హయాంలో నిర్మించిన శ్రీశైలం,నాగార్జున,ఎస్ఆర్ ఎస్పి, ఎల్ ఏమ్ డి,మిడ్ మానేర్ 70% ప్రాజెక్ట్ లు కనిపించడం లేదా అని అన్నారు. 1లక్ష 25 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన మేడిగడ్డ కేవలం కేసిఆర్ ,కేటిఆర్ ల కమీషన్ల కక్కూర్తికే కుంగింపొయిందని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ఏటిఎం గా మారిందని ,కేసిఆర్ ,కేటిఆర్ లు జెైలుకు వెళ్ళడం కాయమని చెప్పిన అమిత్ షా,బండిసంజయ్ లు కేసిఆర్ ను ఎందుకు జైలుకు పంపలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, గోనె ఎల్లప్ప ,వైద్య శివప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి, గోలి వెంకటరమణ ,మ్యాన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply