‘బి.సి ‘లు బలపడితే భవిష్యత్ ఉండదని…”బండి’ని తప్పించారా(రు)….?

Published by

on

• బిజేపి పార్టి రాష్ట్ర అధ్యక్ష పదవి ‘బండి”కి రావడంతో మారిన బిజెపి గ్రాఫ్.

• కులాలకు అతీతంగా “బిజెపి”లో చేరిన యువత.

• ‘బండి “మద్దతు,ప్రేరణతో  బిఆర్ ఏస్ కు పోటపోటిగా  కార్యక్రమాలు చేసిన పార్టి శ్రేణులు.

• ‘బిజెపి అదిష్టానం’ ప్రణాళికలో భాగంగానే “బండి’ని  వాడుకుందా??

• ఇలాంటి పరిణామాల వల్ల భవిష్యత్ లో బిజెపిని నమ్మేదెవరు…?

నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :

 ‘బి.సి ‘లు బలపడితే రాజకీయ భవిష్యత్ ఉండదని…”బండి సంజయ్ ని ,బిజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించారా..? అంటే అవుననే వాదనకు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు బలాన్ని చేకురుస్తున్నాయి.బిజెపి లాంటి జాతీయ పార్టిలో సాధారణ గల్లీ  లీడర్ గా,తన  రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, నేడు ఢీల్లీ లీడర్ గా ‘బండి’ ఎదిగాడంటే ,అదంత ఆయనకు పార్టి పట్ల ఉన్న నిబద్దత,అకింత భావం, తాను పార్టికి చేసిన నిరంతర కృషియేనని చెప్పాలి.అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , ఇప్పటి తెలంగాణ రాష్ట్రాలలోని బిజెపి చరిత్రలో 11మార్టి2020  ఓ మైలురాయి గా బిజెపి  చరిత్రలో  లిఖించబడి ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.దానికి కారణం బండి సంజయ్ ని తెలంగాణ బిజెపి పార్టి అధ్యక్షునిగా నియమించడమే. బిజెపి పార్టి అధ్యక్ష పదవి పగ్గాలు చెపట్టిన  నాటి అధ్యక్షులు వెంకయ్య నాయుడు,ఇంద్ర సేన రెడ్డి,బండారు దత్తాత్రేయ చిలకం రాంచంద్రయ్య,విద్యసాగర్ రావు,కె.లక్ష్మణ్ ,కిషన్ రెడ్డిల హాయాంలో పెరగని బిజెపి గ్రాఫ్ ‘బండి’హయంలో పెరిగిందనడాని ప్రత్యక్షసాక్షం    గ్రామాలలో సైతం బిజెపి జెండాలు రెపరేపలాడటమే.

హిందుగాళ్ళు….బొందుగాళ్ళతో మారిన స్వరం.

రాజకీయ నిపుణుడుగా ప్రశంసించబడుతున్న కేసిఆర్  నోటి నుండి దొరలిన తప్పిదమే హిందుగాళ్ళు…బొందుగాళ్ళు, అన్న పదాలు.ఈ తప్పిదమే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందనడంలో అతిశయోక్తిలేదు.2018 లో కరీంనగర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ‘బండి” 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అదే కరీంనగర్ నియోజకవర్గం నుండి  కేసిఆర్ నోరు జారడం వల్ల గెలుపొంది,తదనంతరం బిజేపి పార్టి రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టి,బిజెపి రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని సాహసాలైన, పాత బస్తిలోని భాగ్య లక్ష్మి టెంపుల్ , ‘బెంసా” ప్రాంతాల నుండి పాదయాత్ర చేయడమే. ఈ రెండు రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలు కావడం, ఇక్కడి నుండే ‘బండి’ పాదయాత్ర పోలిస్ ల అడ్డగింతలు తప్ప దిగ్విజయంగా సాగడం,పార్టి శ్రేణులు,ముఖ్యంగా యువతలో నూతన ఉత్సహం నింపిందనడంలో ఎలాంటి అనుమానం లేదనే చెప్పాలి.ఈ రెండు చర్యల స్పూర్తితో పార్టి శ్రేణులు ఒక్కసారి నూతనోత్సహంతో కదంతొక్కడంతో పార్టి రాష్ట్ర నలుమూలలకు వ్యాప్తి చెంది,ఒకానొక దశలో బిఆర్ ఎస్ కు గట్టిపోటి బిజెపినే అనే స్థాయికి చేరింది.

రాజకీయ భవిష్యత్ ఉండదనే ‘బండి’ని మార్చారా?(రు).

దేశంలో అత్యధిక జనాభా బి.సిలదే.కాని రాజ్యాధికారంలో వారి పాత్ర అంతంత మాత్రమే.ఏ బి.సి నాయకుడైన  రాజకీయంగా ఎదిగితే ,అగ్రవర్ణ కుల నాయకులకు సామాంతర నాయకునిగానో,సానుభూతి పరులు గానో ఉండాలి తప్ప ,రాజ్యాధికారం చేపట్టడమనేది కల్ల. ఒక వేళ  బి.సి లకు రాజ్యాధికార పగ్గాలు ఇచ్చినా? అది రాజకీయ చదరంగంలో భాగమే..!తప్ప మరొకటి కాదు. అగ్రవర్ణ రాజకీయ నాయకుల ఆలోచనలకు ప్రతిబింబమే ‘బండి’ని తెలంగాణ బిజెపి పార్టి అధ్యక్ష పదవి నుండి తొలగించడం. బిజేపి రాష్ట్ర అధ్యక్షునిగా పదవి చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రంలోని బి.సి వర్గాలకు చెందిన మున్నురుకాపు,ముదిరాజ్ ,యాదవ,గౌడ,పద్మశాలి సామాజిక వర్గాలను అత్యంతగా ప్రభావితం చేశారు.ఫలితంగా ఆయా కులాల నాయకులు, ముఖ్యంగా యువత భారీ సంఖ్యలో బిజెపి పార్టి లోకి చేరారు.ఒ పక్క 10 ఏళ్ళ నుండి రాష్ట్రాన్ని పాలిస్తున్న బిఆర్ ఎస్ ఉన్న,అధికార పార్టిని సైతం లెక్క చేయకుండా,ఎస్సి యువకులు సైతం బిజెపిలోకి వెళ్ళారంటే ‘బండి’ఎంత ప్రభావం చూపాడో అర్థం చేసుకోవచ్చు. ఇదంత గమనిస్తున్న అగ్ర వర్ణ రాజకీయ నాయకులు, ఇలాగైతే రాబోవు రాజ్యాం బి.సిల దే అయితే ,తాము సామాంతులుగా ఉండటం కాయమని భావించారో ఏమో,ఎన్నికల వేళ మార్పు మంచిది కాదని,పార్టి క్షీణిస్తుందని తెలిసి ‘బండి’ని అధ్యక్ష పదివి నుండి తొలగించి,అగ్ర వర్ణ నాయకుడైన కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా చేశారు. ఫలితంగా బిజెపి గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోపయింది. ఎది  ఎలాజరుగుతున్న  దేశ,రాష్ట్ర రాజకీయాల పట్ల యువత దృష్టి సారించింది. ఇయేడు,కాకున్న మరోయేడైనా రాజ్యాధికారంలో వాట తప్పదని అగ్రవర్ణ నాయకులు తెలుసుకొనేలా చేయడానికి ,ఈ ఎన్నికలే సాక్షాలుగా  బి.సిలు వారి ఉద్ద్యేశాన్ని ఓట్ల రూపంలో తెలిపే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Leave a Reply

October 2023
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading