నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :
కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్తాం, వందలాదిగా నామినేషన్లు వేసి వారిని ఓడిస్తామని అమర వీరుల కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
శుక్రవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ,తెలంగాణ అమర వీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక,తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక,దళిత సంఘూల జేఏసి ఆధ్వర్యంలో నామినేషన్లు వేసి వారిని ఓడిస్తామన్నారు.ఆనాడు ఉద్యమాలు చేయమని పిలుపునిచ్చిన ఈ నాయకులు,నేడు మా తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించడం లేదని ఆవేదన చెందారు.తెలంగాణ రాష్ట్రం కోసం మా పిల్లలు ఆత్మ బలిదానాలు చేస్తే, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఉద్యోగాల కోసం నేటి వరకు సుమారు 5000 మంది నిరుద్యోగ యువత ఆత్మబలి దానాలు చేసుకున్నారని వాపోయారు. ఇంకెంతమంది చనిపోతే మీ కల్వకుంట్ల కుటుంబానికి దాహార్తి తీరుతుందని ప్రశ్నించారు.రాబోయే ఎన్నికలలో కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించి, తెలంగాణని రక్షించుకుందామని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నామని కోరారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు మమత, సునీత, ప్రేమలత, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నాను.











Leave a Reply