• నిన్నమొన్నటి దాక బిఆర్ ఎస్ ను తిట్టిన బిజెపి నాయకులు బిఆర్ఎస్ లోకి చేరడం పై సర్వత్ర విమర్శలు
• పదవులు,కాంట్రాక్ట్ లు,స్వలాభం కొరకే పార్టిలు మారుతున్న నాయకులు,యువత.
• ఇలా పూటకో పార్టి మారే నాయకులను “పదవుల్లో”కూర్చోబెడితే “భవిష్యత్ “అంధకారమే…!
నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం) : నిన్న మొన్నటి దాక తిట్టుకున్న , బిజెపి , బిఆర్ ఎస్ పార్టి పెద్దలందరు ఒక్కటైనప్పుడు, మనమెందుకు తన్నుకోవడమని అనుకుంటున్నారేమో,కొంత మంది ద్వితియ శ్రేణి నాయకులు, యువత. “బిజెపి”పార్టిలో ‘బండిసంజయ్ ‘ హయాంలో ఉత్సాహంగా బిఆర్ ఎస్ కు పోటాపోటి గా నిలిచి,పరస్పరం ఘూటైన విమర్శలు చేసిన,బిజెపి నాయకులు, అవన్ని పక్కన పెట్టి బిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకొవడం పట్ల ప్రజలు విస్మయానికి గురౌతున్నారు. మరికొందరు రాజకీయాలంటేనే ఇలా ఉంటాయని,ఉసురుమంటున్నారు.రోజుకో రంగుపులుముకుంటున్న రాజకీయ నాయకుల తీరుతో ప్రజల్లో ఎన్నికలు , రాజకీయాలంటేనే ఎవహించుకొనే పరిస్థితి నెలకొంది.
రాజకీయాలంటే సేవకాదు….?పదవులు,కాంట్రాక్ట్ లు,స్వలాభం….?
ఒ ఎజెండా ఎర్పాటు చేసుకొని ,రాజ్యాంగమూలాలకు కట్టుబడి ,ప్రజలకు సేవ చేయడాన్ని రాజకీయం లేదా రాజకీయాలు అంటారు.అలాంటి రాజకీయాలకు నేటి యువతరం ఇస్తున్న నిర్వచనం ,రాజకీయమంటే పదవులు,కాంట్రాక్ట్ లు,స్వలాభం,బంధుప్రీతి.ఈ దేశానికి మూలస్థంబాలు యువకులేనని ఎ సందర్భంలో అన్నారో పెద్దలు,కాని నేటి యువత స్వార్థపరుల ఆలోచనల్లో బంది అయిపోయి, కనీసం ప్రజలకు ప్రభుత్వాలు చేస్తుందేంటి…? చెప్పినదేంటి?భావితారలకు ఒరిగేదేంటి…? అని ఎమాత్రం ఆలోచించుకోకుండా, స్వార్థ రాజకీయాలలో పాల్గొనడానికి కంకణ బద్దులౌవ్వడం చూస్తే దేశ భవిష్యత్ ఎలా మారుతుందోనని ఊహించుకొంటేనే,ఆందోళన కలుగుతుంది.ఏది ఏమైన నేటి యువత,నేటి రాజకీయాలను పరిశీలిస్తే భావి తరాలకు భవిష్యత్ ఉంటుందా అనే అనుమానం కలగకమానదని రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.











Leave a Reply